E-Paper
Advertisement

TSRTC: కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్..

TSRTC: కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్..
Advertisement

TSRTC: తెలంగాణలో 80 కొత్త ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి పచ్చజెండా ఊపి బస్సులను ప్రారంభించారు. తొలుత బస్సుల వద్ద పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సుల్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కొత్త బస్సులతో ప్రయాణికుల ఇబ్బందులు కొంతమేర తగ్గుతాయని తెలిపారు. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సమయంలో కొత్త బస్సులను ప్రారంభించడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్కీమ్‌ వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా.. కొత్త బస్సులను తీసుకొచ్చారు. అత్యాధునిక హంగులతో కూడిన 80 కొత్త బస్సు లు నేటి నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ నాన్ ఏసీ బస్సులున్నాయి. ఈ ఆర్థిక ఏడాదికి గాను 400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సు లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. వీటికి తోడు పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సు లను TSRTC అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ బస్సులన్నీ విడతల వారీగా మార్చి 2024 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా TSRTC ప్లాన్ చేసింది.

Advertisement

.

.

Related News

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

Big Stories

Advertisement
×