E-Paper
Advertisement

Drugs Smuggling: డ్రగ్స్ దందాపై SOT పోలీసుల ఉక్కుపాదం.. విస్తృతంగా తనిఖీలు

Drugs Smuggling: డ్రగ్స్ దందాపై SOT పోలీసుల ఉక్కుపాదం.. విస్తృతంగా తనిఖీలు
Advertisement

Drugs Smuggling: న్యూ ఇయర్‌ వేడుకలతో పోలీసులు డ్రగ్స్‌ మాఫియాపై దృష్టి సారించారు. నగరంలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించనుండంతో మత్తు పదార్థాల దందాపై ఉక్కుపాదం మోపారు SOT పోలీసులు. ఈ మేరకు ఫిలింనగర్‌, షాదనగర్‌లలో స్థానిక పోలీసులతో కలిసి దాడులకు దిగారు. రైడ్స్‌లో ఫిలింనగర్‌లోని ఓ పబ్‌ పార్కింగ్‌ ఏరియాలో డ్రగ్స్‌ అమ్ముతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. అతడి వద్ద నుంచి 20 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బెంగళూరుకు చెందిన బాబు కిరణ్‌గా గుర్తించారు. గత కొంత కాలంగా బాబు కిరణ్‌ డ్రగ్స్‌ అమ్ముతున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.. వారిని పట్టుకునేందుకు నాలుగు బృందాలను రంగంలోకి దిగారు. కాగా.. నిందితుడు కిరణ్‌ను రిమాండ్‌కు తరలించారు.

అలాగే రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోనూ డ్రగ్స్‌ను పట్టుకున్నారు SOT పోలీసులు. న్యూ ఇయర్‌ వేడుకలకుగాను గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు వాహనాల తనిఖీలను చేపట్టారు. ఈ తనిఖీల్లో ప్రియాంక, శ్రీతేలను అదుపులోకి తీసుకుని వారి లక్ష రూపాయల విలువ చేసే 11 గ్రాముల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డ్రగ్స్‌ ఎక్కడ నుంచి తీసుకువస్తున్నారు? ఎవరికి విక్రయిస్తున్నారు? అన్నదానిపై కూపీ లాగారు. గోవాలో ఉంటున్న శివ, భరత్‌కుమార్‌ సాయంతో హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను తరలించి ఇక్కడ విక్రయిస్తున్నారని.. గోవాలోని అన్య అనే మహిళ నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

Advertisement

.

.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×