E-Paper
Advertisement

ఏ మతానికి దయా గుణం ఎక్కువ? బిచ్చగాడి ఐడియా అదుర్స్.. గెలుపు ఎవరిదంటే?

ఏ మతానికి దయా గుణం ఎక్కువ? బిచ్చగాడి ఐడియా అదుర్స్.. గెలుపు ఎవరిదంటే?
Advertisement

బిచ్చమెత్తుకొనేవారిని చాలా చులకనగా చూస్తారు కొందరు. ఇలా అడుక్కు తినే బదులు.. ఎక్కడైనా పని చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అంటారు. మరికొందరు మాత్రం.. అయ్యో పాపం అని జాలి చూపి తోచినంత దానం చేస్తారు. బిచ్చమెత్తుకొనేవారు కుంటివారు లేదా అంధులైతే.. పెద్దగా అడగాల్సిన పని ఉండదు. జనాలే దయతో దానం చేస్తారు. కానీ, అన్ని అవయవాలు సరిగ్గా ఉండేవారికే బిచ్చం దొరకడం కష్టం. అందుకే, ఓ బిచ్చగాడికి కత్తిలాండి ఐడియా వచ్చింది. జనాల వీక్‌నెస్‌నే తన బిజినెస్‌కు అప్లై చేశాడు. చివరికి సక్సెస్ అయ్యాడు.

ఎప్పుడు ఎక్కడ?

ఈ ఘటన కొన్నేళ్ల కిందట అమెరికాలో చోటుచేసుకుంది. ఓ ఇన్‌స్టా యూజర్ తాజాగా ఈ ఫొటోను మళ్లీ పోస్ట్ చేశాడు. దీంతో ఇది మరోసారి వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన బిక్షాటన చేస్తున్న ఓ వ్యక్తికి ఈ ఐడియా వచ్చింది. రోజంతా కూర్చున్నా తన బొచ్చు నిండటం లేదు. పోనీ పాటలు పాడి, విన్యాసాలు చేసి.. జనాలను ఆకట్టుకొనే టాలెంట్ కూడా తనకు లేదు. అందుకే, కదలకుండా కాసులు కురిపించే మార్గాల కోసం ఆలోచించాడు. అప్పుడే ఈ ఆలోచన తట్టింది. పేపర్ల మీద నాస్తికత్వంతోపాటు క్రిస్టియన్, బౌద్ధం, ముస్లిం మతాల పేర్లు రాసి కట్ చేశాడు. వాటిని లైనుగా పేర్చి.. చిల్లర కోసం ఆయా మతాల పేర్లున్న చోట బొచ్చులు పెట్టాడు. ఆ తర్వాత ‘‘నిరాశ్రయుల పట్ల ఏ మతం అత్యధికంగా దయ చూపుతుంది?’’ ( Which religion cares the most about the homeless? అని ఒక అట్టముక్క మీద రాసి కూర్చున్నాడు.

మతంపై ప్రేమ ఉంటే.. గెలిపించుకోవల్సిందే..

Advertisement

ఇక అతడి బెగ్గింగ్ కాన్సెప్ట్‌ను విశ్లేషిస్తే.. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి తన మతాన్ని ప్రేమిస్తాడు. అంతేగాక, తమ మతం మిగతా మతాల కంటే గొప్పదనే భావన ఉంటుంది. కాబట్టి.. ఆ బోర్డు చూసిన తర్వాత తప్పకుండా ఆ మతానికి చెందిన వ్యక్తి ‘చిల్లర’తో జవాబు చెప్పాలి. అందుకే.. అటుగా వెళ్లేవారు తమ మతమే గొప్పదని చెప్పేందుకు తమ మతానికి చెందిన బొచ్చుల్లో డబ్బులు వేయడం మొదలుపెట్టారు. అలా దాదాపు అన్ని మతాలకు సంబంధించిన బొచ్చుల్లో చిల్లరపడింది. అయితే ఆ బిచ్చగాడు అంతటితో ఆగలేదు. ఆ చిల్లర కౌంట్ చేస్తూ.. ఏ మతం ముందంజలో ఉందో చెప్పడం మొదలుపెట్టాడు. దాంతో తమ మతాన్ని ఎలాగైనా గెలిపించుకోవాలనే పోటీ జనాల్లో కలిగింది. మరింత చిల్లరను ఆ గిన్నెల్లో వేయడం మొదలుపెట్టారు. అలా ఆ రోజు అతడి పంట పండింది.

గెలిచింది ఎవరు?

ఈ పోటీలో మొదటి విజేత.. ఏ మతానికి చెందని ఆ నిరాశ్రయుడు. ఎందుకంటే.. జనాలు తమ మతమే అత్యంత దయగలదని నిరూపించుకొనే ప్రయత్నంలోనే అక్కడి గిన్నెల్లో డబ్బులు వేశారు. దయతో కాదు. చిత్రం ఏమిటంటే.. తమ మతానికి మద్దతు తెలిపే క్రమంలో వారికి తెలియకుండా ఆ పేదవాడి కడుపు నింపారు. ఈ ఫొటోను అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతడి ఐడియా తనని భలే ఆకట్టుకుందని చెప్పాడు. ఆ బొచ్చుల్లో.. నాస్తికత్వానికే ఎక్కువ చిల్లర పడినట్లు చెప్పాడు. ఏది ఏమైనా ఆ బిచ్చగాడిది బుర్రే బుర్ర. ఒక వేళ ఇదే కాన్సెప్ట్‌తో మన దేశంలో ఎవరైనా ఫాలో అయితే? ఏ మతం గెలుస్తాదనేది తర్వాతి విషయం. అంతిమ విజయం మాత్రం.. ఆ బిచ్చగాడిదే అవుతుంది. ఒక్క రోజులోనే అతడు కోటీశ్వరుడైపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

Advertisement

Also Read: ఫోన్ చోరీ అయిందా? మీ బ్యాంక్ ఖాతాను కాపాడేందుకు వెంటనే ఈ 5 పనులు చేయండి

Disclaimer: The views and concepts discussed in this article reflect a unique social media phenomenon and human behavior analysis. The content is presented purely for entertainment and informational purposes without any intent to disparage religions or beliefs.

Tags

Related News

ప్రెజర్ కుకర్ లేకుండా పప్పు త్వరగా మెత్తగా ఎలా ఉడికించాలి? ఈజీ కిచెన్ టిప్స్ మీకోసం

సినిమాల్లో బోల్డ్ సీన్లు ఎలా షూట్ చేస్తారు? కెమెరా వెనుక జరిగేది ఇదే

ఫోన్ చోరీ అయిందా? మీ బ్యాంక్ ఖాతాను కాపాడేందుకు వెంటనే ఈ 5 పనులు చేయండి

మోసం చేసిన వారిని ఎప్పటికీ క్షమించరు.. ఈ తేదీల్లో పుట్టినవారు తప్పు చేస్తే రెండో ఛాన్స్ ఇవ్వరు

చాటింగ్‌లో మనసును తాకే మాటలు, కవిత్వాలు.. నిజజీవితంలో మాత్రం బోర్.. ఎందుకలా?

జిమ్‌కు వెళ్లకుండానే ఫిట్‌గా ఉండాలా? ఈ సింపుల్ వాకింగ్ టెక్నిక్స్ చేస్తే సరి

మూత్రంలో రక్తం రావడంతో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. గుండెలో సూది చూసి షాకైన డాక్టర్లు..

Big Stories

Advertisement
×