Palla Rajeswara Reddy: ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్‌లో రాత్రి ఏం జరిగింది? ఎందుకు ఆ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి అస్వస్థత గురయ్యారు? ఫామ్‌హౌస్‌లో ఏమైనా గొడవలు జరిగాయా? ఎందుకు ఆ పార్టీ శ్రేణులు కంగారు పడుతున్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
బుధవారం కాళేశ్వరం కమిషన్ ముందుకు రానున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఈ క్రమంలో ఆయనను కలిసివారిలో ఆ పార్టీ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఆ పార్టీకి చెందిన మిగతా నేతలు వెళ్లి ఇంటికి వచ్చేశారు. రాత్రి మాత్రం పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడే ఉండిపోయారు.
ఫామ్ హౌస్‌లో పల్లా కాలు జారిపడినట్టు వార్తలు వస్తున్నాయి. కాస్త గాయాలు తగిలినట్టు తెలుస్తోంది. వెంటనే ఆయన్ని ఫామ్‌హౌస్ నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని అంటున్నారు. ఈ విషయం తెలియగానే బీఆర్ఎస్ నేతలు షాకయ్యారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాత్రి ఫామ్ హౌస్‌లో ఉండటానికి కారణాలేంటి? అన్నదానిపై రకరకాలుగా ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి ఎవరు వెళ్లినా మహా అయితే గంట లేదా రెండు గంటల్లో తిరిగి వచ్చేస్తారు. అంతకుమించిన పని ఉంటే తప్ప కేటీఆర్, హరీష్‌రావులు సైతం ఎక్కువ సేపు ఉన్న సందర్భం లేదంటున్నారు.
ALSO READ: కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్, ఆ ఒక్కటే మార్గమా?
అలాంటిది ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాత్రంతా అక్కడే ఉన్నారంటే ఏదో జరుగుతోందన్న చర్చ అప్పుడు తెలంగాణ ప్రజల్లో మొదలైంది. గతంలో కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడిపోయారని, ఇప్పుడు పల్లా వంతైందని అంటున్నారు కారు పార్టీ కేడర్. ఫామ్‌హౌస్, దాని చుట్టూ ఏదో అదృశ్యశక్తులు తిరుగుతున్నట్లు చెబుతున్నారు.
కొందరైతే ఫామ్ హౌస్‌కు వాస్తు కష్టాలు ఉన్నాయని అంటున్నారు. ఇటీవల ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ ఫ్యామిలీ యాగం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సమ్‌థింగ్ ఫామ్‌హౌస్‌లో ఏదో జరుగుతోందన్న చర్చ ప్రత్యర్థుల నుంచి బలంగా వినిపిస్తోంది. దీనిపై బీఆర్ఎస్ వర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.
ఫామ్‌హౌస్‌కు కవిత?
ఇదిలావుండగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ నేపథ్యంలో కేసీఆర్‌ను కవిత దంపతులు కలిశారు. తండ్రికి మద్దతుగా కవిత అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ వద్ద కూతురు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తండ్రి-కూతుళ్ల మధ్య ఎలాంటి చర్చ జరిగింది? రేపటి రోజున పార్టీలో ఏమైనా కీలకమైన మార్పులు చేర్పులు ఉంటాయా?
అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేసీఆర్‌కు కమిషన్ నోటీసులు ఇవ్వడంపై ఇటీవల కవిత ధర్నా నిర్వహించారు. అధినేతకు నోటీసులు ఇవ్వడాన్ని ఆ పార్టీ నేతలు ప్రశ్నించక పోవడాన్ని పలుమార్లు ఆఫ్ ద రికార్డులో తప్పుబట్టారు కూడా. ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న పరిణామాలు, కవిత వ్యవహారం, పల్లా రాజేశ్వర్‌రెడ్డి జారిపోవడం వంటి అంశాలపై నేతలు, కార్యకర్తలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.