NTR Vs Balakrishna: గత కొన్ని రోజులుగా నందమూరి కుటుంబంలోనే.. ఎన్టీఆర్ (NTR) వర్సెస్ బాలకృష్ణ (Balakrishna) అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎన్నికల సమయం నుండే నందమూరి బాలకృష్ణ – ఎన్టీఆర్ మధ్య విభేదాలు వచ్చాయని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉంటారు. అయితే వీరి మధ్య విభేదాలు రావడానికి వ్యక్తిగతంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయంటూ పలు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక దీనికి తోడు గత ఏడాది సీనియర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ.. ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీయించడం, అటు ఎన్టీఆర్ కూడా ఎక్కడా బాలకృష్ణ గురించి ప్రస్తావించకపోవడం చూస్తే వీరి మధ్య గొడవలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. దీనికి తోడు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి యంగ్ హీరోలను మొదలుకొని స్టార్ హీరోలు కూడా వచ్చి సందడి చేశారు. ఇక ఎన్టీఆర్ తోటి నటీనటులు కూడా వచ్చి అలరించారు. కానీ ఎన్టీఆర్ కి మాత్రం ఆహ్వానం అందలేదు.
బాలయ్యకు కళ్యాణ్ రామ్ స్పెషల్ విషెస్..
ఇలా ఒక్కటేమిటి చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు వీరి మధ్య గొడవలు ఉన్నాయనడానికి కారణమవుతున్నాయి అంటూ అటు అభిమానులు కూడా వాపోతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల క్రితం ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఈవెంట్లో బాలా బాబాయ్ అంటే తనకు చాలా ఇష్టమని, తన తండ్రి తర్వాత తండ్రి అని ఎన్టీఆర్ చెప్పారు. బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ తో కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని కూడా వార్తలు వినిపించాయి. అయితే నిన్న బాలకృష్ణ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారని అందరూ వేయికళ్లతో ఎదురు చేశారు. అయితే నిన్న ఉదయమే 8:00 గంటల సమయంలో కళ్యాణ్ రామ్ ఎక్స్ వేదికగా “బాలా బాబాయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ లవ్ ఏమోజీ తో కూడిన పోస్టు షేర్ చేశారు.
బాలయ్య తో కలవడం ఎన్టీఆర్ కి ఇష్టం లేదా..
దీంతో హమ్మయ్య కళ్యాణ్ రామ్ విషెస్ చెప్పారు.. ఇక ఎన్టీఆర్ కూడా విషెస్ చెబితే కలిసిపోవడమే తరువాయి అంటూ అభిమానులు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ నిన్న మొత్తం ఎదురుచూసినా ఎన్టీఆర్ ఎక్స్ ఖాతాలో బాలకృష్ణ కు సంబంధించి ఒక్క పోస్టు కూడా లేకపోవడంతో ఎన్టీఆర్ కి బాలకృష్ణతో కలవడం ఇష్టం లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తాజాగా నిన్న జరిగిన పరిస్థితులను బట్టి చూస్తే నందమూరి బాలయ్య ఫ్యామిలీతో కలవడానికి కళ్యాణ్ రామ్ అత్యుత్సాహం చూపిస్తున్నప్పటికీ.. ఎన్టీఆర్ మాత్రం దూరం జరుగుతున్నాడనే వార్తలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కళ్యాణ్ రామ్ ఆరాటం.. ఎన్టీఆర్ దూరం అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందని ఇప్పుడు నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై ఈ హీరోలు ఏదైనా స్పందిస్తారో చూడాలి.
ALSO READ:SSMB -29: మహేష్ సినిమాకు.. రామాయణం ఇంద్రజిత్ కు లింక్ ఏంటి?