Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు? తనను తాను తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తారా? ప్రాజెక్టు నిర్మాణం కేబినెట్ తీసుకున్న నిర్ణయమని అందర్నీ లాగుతారా? లేకుంటే ఇంజనీరింగ్ అధికారులదే ఆ వైఫల్యమని తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
మాజీ సీఎం కేసీఆర్ బుధవారం జస్టిస్ పీసీ ఘోస్ కమిషన్ ముందు హాజరుకానున్నారు. ఉదయం 11:30 గంటలకు బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో విచారణ మొదలుకానుంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవకతవకలపై ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది. విచారణలో భాగంగా 115వ సాక్షిగా కేసీఆర్ అటెండ్ కాబోతున్నారు. ఇప్పటివరకు 114 మంది సాక్షులను ప్రశ్నించింది కమిషన్.
వారిలో ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, రాజకీయ నేతలు ఉన్నారు. రాజకీయ నేతలు ఏం చెప్పారో తెలీదుగానీ, అధికారులు, కాంట్రాక్టర్లు మాత్రం ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు తాము చేశామన్నది వాళ్ల వెర్షన్. ఇప్పటివరకు మీడియా సమక్షంలో కమిషన్ విచారణ చేపట్టింది. కేసీఆర్ విషయంలో ఇదే పద్ధతిని అనుసరిస్తారా? లేదా అనేది చూడాలి.
ప్రాజెక్టు అనుమతులు, నిర్మాణాలు, సాంకేతిక వివరాలకు సంబంధించి చాలామందిని విచారించి వివరాలు రాబట్టింది కమిషన్. అందులో రాజకీయ నేతల పాత్రపై ఫోకస్ చేసింది. జూన్ 6న ఆర్థికశాఖ మాజీ మంత్రి ఈటల, 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణ ముందు హాజరయ్యారు. కేవలం 40 నిమిషాల్లో తమ విచారణను ముగించారు. కేసీఆర్ విచారణ ఎక్కువ సేపు పట్టే అవకాశముందని అంటున్నారు.
ALSO READ: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్
ప్రాజెక్టు డిజైన్‌పై మాకు ఎలాంటి అవగాహన లేదని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ వంతైంది. ఆయన కూడా దాదాపు ఇలాంటి సమాధానాలు చెప్పవచ్చని అంటున్నారు. సాంకేతిక విషయాల్లో తమకు ఏ మాత్రం సంబంధం లేదని చెబితే.. అధికారులు ఇరుక్కుపోవడం ఖాయమని అంటున్నారు. దీనిపై ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
అటు అధికారులు, ఆనాటి మంత్రులుగా పని చేసినవారి నుంచి పలు విషయాలు సేకరించింది. దీని ఆధారంగా ప్రశ్నలు రెడీ చేసిందట కమిషన్. కేసీఆర్ విచారణతో కాళేశ్వరం కమిషన్ ముగియనుంది. కమిషన్ ఎలాంటి విషయాలు అడిగింది బయటకు చెప్పకపోయినా, రిపోర్టు మాత్రం అసెంబ్లీలో చర్చకు వస్తుందని అంటున్నారు.
ప్రాజెక్టు విషయంలో ఎన్నో సమావేశాలు జరిగాయి. ఫైనల్‌గా నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి మాత్రమే. తాము ఆదేశాలు జారీ చేసేవరకు మాత్రమేనని, పని చేసేది అధికారులేనని చెప్పి కేసీఆర్ తప్పించుకుంటారా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో గతేడాది మార్చిలో జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్‌ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తానికి కేసీఆర్ హాజరుకానుండడంతో ఏమి జరుగుతుందా అంటూ ఆ పార్టీ శ్రేణులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్
ఉత్కంఠ రేపుతున్న కాళేశ్వరంపై కేసీఆర్ విచారణ
ఉదయం 11 గంటలకు కమిషన్ కార్యాలయం బీఆర్కే భవన్‌కు చేరుకోనున్న కేసీఆర్
విచారణలో భాగంగా కేసీఆర్‌కు సంఘీభావంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం
విచారణ ఎదుర్కొన్న హరీశ్ రావును ఇదివరకే కమిషన్… https://t.co/7kmdup32l8 pic.twitter.com/RHTdet434J
— BIG TV Breaking News (@bigtvtelugu) June 11, 2025