MLA: ఆపదలో ఉన్న వ్యక్తిని రక్షించి ఓ ఎమ్మెల్యే తన సమయస్ఫూర్తిని చాటుకున్నారు. సీపీఆర్ ద్వారా భద్రాచలం ఎమ్మెల్యే డా.తెల్లం వెంకట్రావు ఒక వ్యక్తిని రక్షించారు. శ్రీరామ నవమి ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎమ్మెల్యే ఈరోజు భద్రాచలంలో పర్యటించారు. ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా చాలా మంది కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత ఎమ్మెల్యే మీటింగ్‌లో మాట్లాడారు. ఆ సమయంలో కార్యకర్త సుధాకర్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు.
అది గమనించిన తెల్లం వెంకట్రావు వెంటనే అప్రమత్తమయ్యారు. గుండె పోటు కారణంగానే సుధాకర్ కిందపడినట్లుగా గుర్తించి ఆయన అక్కడికి వెళ్లి సీపీఆర్ చేశారు. కొద్దిసేపటికి కార్యకర్త తేరుకున్నారు. ఆ తరువాత కార్యకర్తలు అంబులెన్స్ రప్పించి సుధాకర్‌ను హాస్పిటల్‌కు పంపించారు. ప్రాణాలు కాపాడినందుకు తెల్లంకు సుధాకర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, వృత్తిరీత్యా ఎమ్మెల్యే అయినప్పటికీ గతంలో తెల్లం డాక్టర్‌గా కూడా పని చేశారు. తన మీటింగ్‌కు వచ్చన సమయంలో, లేదా పర్యటనల్లరో ఎవరు అస్వస్థతకు గురైనా తెల్లం వెంటనే స్పందించి కావాల్సిన సహాయం చేస్తారు. ఈ సారి కూడా అలాగే గుండెపోటు వచ్చి పడిపోయిన వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు.