MI VS LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 15 మ్యాచులు పూర్తయ్యాయి. ఇవాళ 16వ మ్యాచ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ… లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల ( Mumbai Indians vs Lucknow Super Giants ) మధ్య… కీలక మ్యాచ్ జరగబోతోంది. అటల్ బీహార్ వాజ్పేయి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow ) వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ… కాసేపటి క్రితమే ముగిసింది. ఇక ఇందులో టాస్ గెలిచిన… ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఇక ముంబై ఇండియన్స్ బౌలింగ్ చేయబోతున్న నేపథ్యంలో మొదట బ్యాటింగ్ కు దిగబోతుంది లక్నో సూపర్ జెంట్స్.
Also Read : Rohit Sharma: వివాదంలో రోహిత్ శర్మ… ముంబైని నిండా ముంచేలా ఉన్నాడే..?
రోహిత్ శర్మ లేకుండానే బరిలోకి ముంబై
లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల ( Mumbai Indians vs Lucknow Super Giants ) మధ్య ఇవాళ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో హార్దిక్ పాండ్యా సేనకు బిగ్ షాక్ తగిలింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కాబోతున్నాడు. రోహిత్ శర్మకు మోకాలి గాయం జరిగినట్లు తెలుస్తోంది. అందుకే ఇవాల్టి మ్యాచ్ కు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం అవుతున్నారని. అయితే… రోహిత్ శర్మ స్థానంలో కొత్త ప్లేయర్ బరిలోకి వస్తున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో రాజ్ భవ ( Raj Bhava) అనే ఆల్రౌండర్ను బరిలోకి దించుతోంది హార్దిక్ పాండ్యా సేన. ఇక ఈ రెండు జట్ల మధ్య… ఇప్పటివరకు 6 మ్యాచులు జరిగాయి. ఇందులో ఏకంగా ఐదు మ్యాచ్లలో ముంబై ఇండియన్స్ ఓడిపోగా… లక్నో సూపర్ జెంట్స్ విజయం సాధించింది. అటు ముంబై ఇండియన్స్ ఒకే ఒక్క మ్యాచ్లో విజయం సాధించింది. అంటే లక్నో పైన ముంబై జట్టుకు చెత్త రికార్డు ఉందని చెప్పవచ్చు. మరి ఇవాల్టి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.
Also Read : Venkatesh Iyer: 300 లేదు బొక్క లేదు… SRH పరువు తీసిన వెంకటేష్ అయ్యర్ ?
లక్నో సూపర్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ జట్ల వివరాలు ఇవే
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(w), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (c), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, దీపక్ చాహర్, విఘ్నేష్ పుత్తూర్
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్‌రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్