E-Paper
Advertisement

Mancherial: మందమర్రిలో విషాదం.. తల్లీకూతుళ్ల ఆత్మహత్య..

Mancherial: మందమర్రిలో విషాదం.. తల్లీకూతుళ్ల ఆత్మహత్య..
Advertisement
TS News updates

Mancherial Latest news(TS news updates):

మంచిర్యాల జిల్లా మందమర్రిలో తల్లి కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చెన్నై నుంచి వలస వచ్చిన మురుగన్- ధనలక్ష్మి దంపతులు ఇక్కడ పాపుడాలు, చెకోడీలు తయారు చేసి విక్రయిస్తూ.. జీవనం సాగిస్తున్నారు. పని నిమిత్తం మురుగన్ బయటకు వెళ్లగా.. గత అర్థరాత్రి.. ధనలక్ష్మి (36), ఆమె కూతురు జీవని (16) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ధనలక్ష్మి కొడుకు సిద్ధు.. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నా గమనించలేదు. ఉదయం లేచి చూసేసరికి.. తన తల్లి, సోదరి ఉరికి వేలాడుతూ కనిపించడంతో ఖంగుతిని.. సొమ్మసిల్లి పడిపోయాడు. తేరుకున్నాక బంధువులకు సమాచారం ఇవ్వడంతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వ్యాపారం ముగించుకున్నాక ఇంటికి తిరిగొచ్చే మురుగున్.. ఇంతవరకూ ఇంటికి రాకపోగా.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దాంతో అతనిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధనలక్ష్మి, జీవని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. వీరిద్దరిదీ ఆత్మహత్యేనా..? లేక మురుగన్ ఏమైనా చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×