BigTV English

Cricketers marriages : క్రికెటర్ల ప్రేమలు.. పెళ్లిళ్లు.. పెటాకులు..

Cricketers marriages : క్రికెటర్ల ప్రేమలు.. పెళ్లిళ్లు.. పెటాకులు..
Cricket news today telugu

Cricketers marriages(Cricket news today telugu) :

తాజాగా క్రికెటర్ల పెళ్లిళ్లపై సామాజిక మాధ్యమాలు వేడెక్కిపోతున్నాయి. ఒకవైపు నుంచి ధావన్ కొడుకు కోసం పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఇంత గొప్ప క్రికెటర్లు అయి ఉండి, కోట్ల రూపాయలు ఆస్తులు ఉండి, పెళ్లి విషయంలో ఎందుకిలా తలకిందులవుతున్నారని కొందరు అంటున్నారు. మరికొందరైతే ఇలా చేసుకున్న క్రికెటర్లు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని చెబుతున్నారు. మరి వారెవరూ.. వీరెవరూ అన్న విషయాలను ఒకసారి చూసేద్దాం…


మహ్మద్ షమీకి.. పెళ్లి తెచ్చిన తంటా..
తనకంటే వయసులో ఐదేళ్లు పెద్ద. ఐపీఎల్ లో చీర్ గర్ల్ అయిన హసీన్ జహాన్ ను 2014లో షమీ పెళ్లి చేసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 ఆడే సమయంలో.. నిప్పులు కురిపించే బాల్స్ తో టీమ్ ఇండియా బౌలర్ మహ్మద్ షమీ రెచ్చిపోతుంటే, సడన్ గా అతని భార్య ఎంట్రీ ఇచ్చింది. అంతవరకు మాటవరసకైనా రాని మహాతల్లి సరిగ్గా తను బ్రహ్మాండంగా ఆడుతున్న సమయంలో మీడియా ముందుకొచ్చి రచ్చ రచ్చచేసింది.

దినేష్ కార్తీక్- మురళీ విజయ్ మధ్య రచ్చ..
ఈ విషయంలో అందరికీ వినిపించే  మొదటి పేరు దినేష్ కార్తీక్. తను చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజారాను 2007లో పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి వివాహం 5 ఏళ్లు మాత్రమే సాగింది. తర్వాత ఆమె అతడిని మోసం చేసి 2012లో టీమిండియా బ్యాటర్ మురళీ విజయ్‌ని పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. దినేష్ కార్తీక్- మురళీ విజయ్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. అంతేకాదు ఇద్దరు తమిళనాడు దేశీయ జట్టులో కలిసి ఆడేవారు. ఈ దెబ్బతో వారి స్నేహం కూడా చెడిపోయింది. విడాకుల తర్వాత.. దినేష్ కార్తీక్ 2015లో భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌ను వివాహం చేసుకున్నాడు.


సేమ్ స్టోరీ.. బట్ నేమ్స్ డిఫరెంట్..
శ్రీలంక వెటరన్ బ్యాట్స్‌మెన్ తిలకరత్నే దిల్షాన్ కథ కూడా అలాంటిదే. దిల్షాన్ భార్య నీలంక వితేజ్ కూడా అతడిని వదిలి మరో క్రికెటర్‌ని పెళ్లి చేసుకుంది. శ్రీలంక జట్టులో దిల్షాన్ దీర్ఘకాల ఓపెనింగ్ భాగస్వామి అయిన ఉపుల్ తరంగను ఆమె వివాహం చేసుకుంది. అయితే ఈ ఇద్దరు ప్రాణ స్నేహితులు. కాకపోతే తర్వాత విడిపోయారు. భార్యతో విడాకుల తర్వాత దిల్షాన్ తన స్నేహితురాలు మంజులను 2008లో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వీరికి ఇద్దరు పిల్లలున్నారు.

కోర్టుల చుట్టూ తిరిగిన అనిల్ కుంబ్లే..
భారతీయ క్రికెటర్, స్పిన్ బౌలర్ అయిన అనిల్ కుంబ్లే.. భర్తతో విడాకులు తీసుకున్న చేతనను 1999లో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికీ ఈ జంట ఎంతో సంతోషంగా కలిసి జీవిస్తున్నారు. అయితే భార్యకి మొదటి భర్తతో కలిగిన అమ్మాయిని తెచ్చుకుని సొంత కూతురిలాగే చూసుకుంటున్నాడు. ఆ అమ్మాయి కోసమే కోర్టులో నాలుగేళ్లు పోరాడాడు.

వెంకటేశ్ ప్రసాద్ కూడా అదే బాటలో..
టీమ్ ఇండియా మాజీ పేస్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా జయంతి అనే  మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే ఒకరితో వివాహం జరిగింది. విడాకులు కూడా తీసుకుని ఉంది. అయితే వీరిద్దరికి అనిల్ కుంబ్లే వలనే పరిచయం జరిగిందట. అలా  కలిసిన వీరిద్దరూ 1996లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం చక్కగా హాయిగా జీవిస్తున్నారు.

అజారుద్దీన్  రెండు పెళ్లిళ్లు..
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ 1987లో 16 ఏళ్ల నౌరీన్ ను మొదటిసారి వివాహం చేసుకున్నాడు. తొమ్మిదేళ్ల తర్వాత నౌరీన్- అజారుద్దీన్ విడిపోయారు. 1996లో బాలీవుడ్ నటి సంగీత బిజ్లానీతో అజార్ ప్రేమాయణం వల్ల మొదటి భార్యకి విడాకులిచ్చాడు. తర్వాత 2010లో సంగీతతో కూడా తెగదెంపులు చేసుకున్నాడు.

జవగళ్ శ్రీనాథ్ రెండో పెళ్లి..
మైసూర్ ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన జవగళ్ శ్రీనాథ్ 1999లో జ్యోత్స్నను వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి విభేదాలతో ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత జర్నలిస్టు మాధవి పాత్రావళిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వారిద్దరూ హాయిగా ఉన్నారు.

ఫ్యామిలీకి టైమ్ ఇవ్వడం లేదని.. బ్రెట్ లీ ని వదిలేసిన భార్య..
ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ కూడా అతని భార్య అయిన డాక్టర్ ఎలిజిబెత్ చేతిలో మోసపోయాడు. తను క్రికెట్ షెడ్యూల్ తో బిజీగా ఉండటం వల్ల ఫ్యామిలీకి సమయం కేటాయించలేకపోయాడు. దాంతో ఆమె బ్రెట్ లీని వదిలి క్రికెటర్‌ని కాకుండా రగ్బీ ప్లేయర్‌ని వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. తర్వాత బ్రెట్ లీ 2014లో లానా ఆండర్సన్‌ను వివాహం చేసుకున్నాడు.

ఇదండీ సంగతి.. చూశారు కదండీ. .మన క్రికెటర్లు వారి పెళ్లిళ్లు.. కొంచెం అర్థం చేసుకోగలిగి, ఒకరినొకరు గౌరవించుకుంటే అసలు సమస్యే ఉండదని వ్యక్తిత్వ వికాస నిపుణులు అంటున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×