BigTV English

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Ganesh Laddu Aucion in Asifabad : వినాయకచవితి ఉత్సవాలు ముగిశాయి. గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు. 11 రోజులుగా మోగిన మైకులన్నీ ఇప్పుడు మూగబోయాయి. వాడవాడలా కనిపించిన పండుగ సందడి కనుమరుగైంది. రంగరంగ వైభవంగా నిమజ్జన వేడుకలను నిర్వహించారు. నిమజ్జనానికంటే ముందు జరిగే ముఖ్యమైన ఘట్టం.. లడ్డూ వేలం. ప్రతి గణేష్ మండపం వద్ద నిమజ్జనానికి ముందు లడ్డూని వేలం వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో వేలల్లో, మరికొన్ని ప్రాంతాల్లో లక్షలు, కోట్ల రూపాయల్లో వేలం పలుకుతుంది. ఈ ఏడాది బండ్లగూడలోని రిచ్ మండ్ విల్లాలో లడ్డూ రూ.1.87 కోట్లు పలికింది.


నవరాత్రులు గణేష్ చేతిలో ఉంచిన లడ్డూని వేలంలో దక్కించుకున్న వారికి ఆ సంవత్సరం అంతా కలిసి వస్తుందన్న ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే లడ్డూ వేలంలో ఉత్సాహంగా పాల్గొంటారు. బాలాపూర్ లో లడ్డూ వేలం ప్రతి ఏటా రికార్డు ధర పలుకుతుంది. ఈ ఏడాదికి లడ్డూ వేలం మొదలుపెట్టి 30 సంవత్సరాలు. 30వ ఏట లడ్డూ రూ.30 లక్షల ఒక వెయ్యి పలకడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని లడ్డూ వేలంపాటలు జరిగినా.. అందరి దృష్టి బాలాపూర్ లడ్డూ వేలంపైనే ఉంటుంది. అయితే.. లడ్డూవేలంలో అంతా హిందువులే ఉంటారు. ముస్లింలు లడ్డూ వేలంలో లడ్డూని దక్కించుకోవడం చాలా అరుదు.

Also Read: ఆల్‌టైం రికార్డ్.. రూ.1.87 కోట్లు పలికిన గణేష్ లడ్డూ.. ఎక్కడంటే?


తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా భట్ పల్లిలో లడ్డూవేలంలో పాల్గొని.. గణపయ్య లడ్డూని దక్కించుకుందో ముస్లిం జంట. భట్ పల్లికి చెందిన ఆసిఫ్ అనే వ్యక్తి.. తన భార్యతో కలిసి లడ్డూ వేలంపాటలో పాల్గొన్నాడు. ఈ వేలంలో లడ్డూని రూ.13,216కు సొంతం చేసుకుని.. అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఈ విషయంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో గంగా జమున తెహజీబ్ విధానాన్ని పాటిస్తారనేందుకు ఇదే నిదర్శనమన్నారు. గణేష్ నవరాత్రి వేడుకలనే కాదు.. రాష్ట్రంలో అన్ని వర్గాలవారు కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకుంటారని X లో పోస్ట్ చేశారు.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×