BigTV English

Bigg Boss 8 Telugu Promo: ‘బిగ్ బాస్’ హౌజ్‌లోకి ప్రభావతి.. కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు, ఆదిత్య ఓం మెడ విరిచేసిన పృథ్వి

Bigg Boss 8 Telugu Promo: ‘బిగ్ బాస్’ హౌజ్‌లోకి ప్రభావతి.. కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు, ఆదిత్య ఓం మెడ విరిచేసిన పృథ్వి

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో టాస్కుల సమయంలో కంటెస్టెంట్స్ అంతా విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ రెండువారాల్లో జరిగిన టాస్కుల్లో చాలామందికి గాయాలు అయినా కూడా పట్టించుకోకుండా అలాగే ఆడుతున్నారు. ఇక ఈవారం కూడా అదే జరగనుంది. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ మధ్య రేషన్ గురించి పోటీ జరిగింది. రేషన్ కోసం జరిగిన మూడు టాస్కుల్లో నిఖిల్ టీమ్ రెండు టాస్కులు గెలవగా అభయ్ టీమ్ కూడా ఒక టాస్క్ గెలిచింది. ఇక రేషన్ గురించి గొడవ ముగిసిపోవడంతో బిగ్ బాస్ హౌజ్‌లోకి కొత్తగా వచ్చిన ప్రభావతి వారి మధ్య మరో చిచ్చుపెట్టింది.


ప్రభావతి వచ్చేసింది

ప్రభావతి 2.0.. అంటే మరెవరో కాదు. ఒక కోడిపెట్ట. బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ప్రభావతితోనే హౌజ్‌మేట్స్ అంతా ఆటలు ఆడనున్నారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ‘‘ఏ టీమ్ సభ్యులు అయితే ఎక్కువ గుడ్లను నాకు తిరిగి ఇస్తారో.. వారికి నా తరపున కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి’’ అంటూ ప్రభావతి చెప్పడంతో కంటెస్టెంట్స్ మధ్య ఆట మొదలవుతుంది. బిగ్ బాస్ హౌజ్‌లోని గార్డెన్ ఏరియాలో ఒక కోడిపెట్ట ఆకారం పెట్టబడి ఉంటుంది. ఆ బొమ్మలో నుండి సమయానుసారం గుడ్లు బయటికి వస్తుంటాయి. వాటిని తీసుకొని తమ ఫోటో ఉన్న బుట్టలో వేసుకొని, వాటిని కంటెస్టెంట్స్ అంతా కాపాడుకుంటూ ఉండాలి.


Also Read: బిగ్ బాస్ 8 ఓటింగ్ లో విష్ణు ప్రియా టాప్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే?

మెడ పట్టుకున్నాడు

సమయానుసారం వచ్చే గుడ్లను తీసుకోవడం కోసం, ఆ గుడ్లను కాపాడుకోవడం కోసం కంటెస్టెంట్స్ మధ్య రచ్చ మొదలయ్యింది. ముందుగా నబీల్ దగ్గర ఉన్న గుడ్లను నిఖిల్ దొంగతనం చేయాలనుకున్నాడు. కానీ అప్పటికే యష్మీ వచ్చి తనను అడ్డుకుంది. గుడ్లను కాపాడుకోవడం కోసం తన టీషర్ట్ లోపల వాటిని దాచుకున్నాడు నబీల్. అయితే గుడ్ల దగ్గరే కూర్చొని వాటిని కవర్ చేయకూడదు అంటూ అవతలి టీమ్‌కు సంబంధించిన గుడ్లను దొంగతనం చేయాలని చూసింది యష్మీ. ముఖ్యంగా నిఖిల్ టీమ్ దగ్గర ఉన్న గుడ్లను లాక్కోవడానికి అభయ్ టీమ్ చాలా ప్రయత్నాలు చేసింది. ఆ క్రమంలో ఆదిత్య ఓం మెడ పట్టుకొని తనను పక్కకు తోశాడు పృథ్వి.

అమ్మాయి అయినా ఆడుతున్నాను

పృథ్వి చేసిన పనికి ఆదిత్య ఓంకు దెబ్బతగిలిందని చెప్పాడు. మెడను అలా చేయొద్దు అని అన్నాడు. దానికి సమాధానంగా నన్ను కూడా ఇద్దరు పట్టుకున్నారని అన్నాడు పృథ్వి. తన మెడను పక్కకు తిప్పారంటూ ఆదిత్య ఓం పదేపదే చెప్తుండడంతో నిఖిల్ టీమ్‌లోని సభ్యులకు కోపమొచ్చింది. అలాంటప్పుడు తాము దాచుకున్న గుడ్ల దగ్గరకు రావద్దని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆదిత్య ఓం సైలెంట్ అయినా కూడా వైలెన్స్‌ను ఇష్టపడే యష్మీ.. దీనికి రియాక్ట్ అయ్యింది. ‘‘దెబ్బలు తగులుతాయి అంటే బిగ్ బాస్‌కు అసలు టాస్కే పెట్టొద్దని చెప్పండి. నేను అమ్మాయే అయినా ఆడుతున్నాను కదా’ అంటూ నిఖిల్ టీమ్‌లోని అమ్మాయిలపై అరిచింది.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×