BigTV English

Mynampally : మాల్కాజ్ గిరి, మెదక్ సీట్ల కోసం మైనంపల్లి పట్టు.. హరీశ్ పై సంచలన కామెంట్స్ ..

Mynampally : మాల్కాజ్ గిరి, మెదక్ సీట్ల కోసం మైనంపల్లి పట్టు.. హరీశ్ పై సంచలన కామెంట్స్ ..
This image has an empty alt attribute; its file name is MYNAMPALLY-INSIDE-ARTICAL-IMAGE.jpg

Mynampally : మంత్రి హరీష్ రావుపై.. మల్కాజిగిరి ఎమ్మెల్యే హనుమంతరావు తీవ్రవ్యాఖ్యలు చేశారు. హరీశ్‌ తన నియోజకవర్గం వదిలి జిల్లా గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. సిద్ధిపేటలో హరీశ్‌ రావు అడ్రస్ గల్లంతు చేస్తానని హెచ్చరించారు.


తాను మల్కాజ్ గిరి నుంచి, తన కుమారుడు మెదక్ నుంచి పోటీ చేస్తామని మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. రాజకీయంగా హరీశ్.. ఎంతోమందిని అణచివేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కుటుంబంలో అంతమందికి టికెట్లు ఇచ్చినప్పుడు.. తనకు, తన కుమారుడికి ఎందుకు టికెట్లు ఇవ్వరని మైనంపల్లి ప్రశ్నించారు.

తన కుమారుడిని ఎమ్మెల్యే చేయడమే లక్ష్యమని మైనంపల్లి స్పష్టం చేశారు. మెదక్‌, మల్కాజ్‌గిరి టికెట్లు ఇస్తేనే బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తామన్నారు. ఇద్దరికీ టికెట్‌ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా సమయంలో తన కుమారుడు ఎంతో ప్రజాసేవ చేశాడని గుర్తు చేశారు. ప్రజలను ఆదుకునేందుకు రూ.8 కోట్ల సొంత డబ్బు ఖర్చు చేశారని మైనంపల్లి తెలిపారు.


Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×