E-Paper
Advertisement

Neelam Madhu : బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లోకి నీలం మధు..?

Neelam Madhu : బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లోకి నీలం మధు..?
Advertisement

Neelam Madhu : బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే టిక్కెట్ల మంటలు ఇంకా చల్లారలేదు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది గులాబీ పార్టీలో ముసలం మరింత ముదురుతోంది. ఎమ్మెల్యే టిక్కెట్ దక్కని నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో పార్టీకి ఒక్కొక్కరూ గుడ్ బై చెబుతున్నారు.

తాజాగా పటాన్ చెరువులో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి టిక్కెట్ దక్కడతో ఆ పార్టీకి చెందిన కీలక నేత నీలం మధు ముదిరాజ్ కారు దిగేందుకు సిద్ధమయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం. నీలం మధు పటాన్ చెరువు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారని అంటున్నారు.

Advertisement

అదే సమయంలో కాట శ్రీనివాస్ గౌడ్ కూడా పటాన్ చెరువు నుంచి కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్శింహ.. కాట శ్రీనివాస్ గౌడ్ కు సీట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.

మరోవైపు బీఆర్ఎస్‌లో కొందరు నేతలకు బీఫామ్ గుబులు పట్టుకుంది. ఇప్పటిదాకా 109 మందికి బీఫామ్ ఇచ్చారు గులాబీ బాస్. అయితే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. తాజా సర్వేల ఆధారంగా అభ్యర్థుల మార్పుపై సీఎం నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

అలంపూర్‌లో అబ్రహం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. నర్సాపూర్ నియోజకవర్గానికి కేసీఆర్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అలాగే నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన కూడా పెండింగ్‌లోనే ఉంది. దీంతో అభ్యర్థులు, ఆశావహులు అయోమయంలో ఉన్నారు. బీఫామ్ ఇచ్చిన తర్వాత మరికొందరు నేతలు బీఆర్ఎస్ కు షాకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×