
Career Guidance : విద్యార్థులకు విషయ పరిజ్ఞానంతోపాటు అన్ని రకాలుగా ఆలోచించే సామర్థ్యం ఉండాలి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ తర్వాత ఎలాంటి కోర్సును ఎంచుకోవాలి? ఏ కెరీర్‌ను ఎంచుకుంటే లైఫ్‌లో త్వరగా సెటిల్ అవ్వగలం అనే విషయాలు కూడా తెలుసుండాలి. కానీ చాలా మందికి అసలు కెరీర్‌ను ఎలా ఎంచుకోవాలో కూడా తెలిసి ఉండదు. అలాంటి కారి కోసం కొన్ని సూచనలు.
లక్ష్యాన్ని బట్టి..
చదువుకునే రోజుల్లో కెరీర్ పరంగా సరైన నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఎంచుకున్న కెరీర్‌లో సక్సెస్ అవ్వలేకపోతే మీకుండే అల్టర్నేటివ్స్ కూడా ఆలోచించుకోవాలి. మీ గోల్, భవిష్యత్ లక్ష్యాలు, మీ సామర్థ్యాలు, బలాలు, బలహీనతలు దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలి.
లోతైన అధ్యయనం..
ఏదైనా కోర్సును ఎంచుకునే ముందు ఆయా కోర్సుల గురించి లోతైన అధ్యయనం చేయాలి. ఏమాత్రం అవగాహన లేకుండా అరకొర సమాచారంతో నిర్ణయం తీసుకొని ఇబ్బందులు పడొద్దు.
మధ్యలోనే వదిలేయండి..
కోర్సు తీసుకున్నాక ముందుకు వెళ్లలేమని అనిపిస్తే.. మధ్యలోనే మరొక కెరీర్‌కు షిప్ట్ అవ్వడం మేలు. రాణించలేమని తెలిసిన తర్వాత కూడా అదే కోర్సు కొనసాగించడం సరికాదు.
సలహా మంచిదే..
నేటి టెక్నాలజీ యుగంలో అనేక మార్గాలు ఎదురుగా ఉండటం వల్ల విద్యార్థులు గందరగోళానికి గురౌతున్నారు. అలాంటి సందర్భాల్లో నిపుణుల సూచనలు, సలహా తీసుకుంటే.. విద్యార్థి వ్యక్తిత్వ లక్షణాలు, దృక్పథం దృష్టిలో పెట్టుకొని సరైన సలహా ఇచ్చే అవకాశం ఉంటుంది.