E-Paper
Advertisement

పవన్ అభిమాని నిరంజన్ ఇష్యూ.. పేర్ని నాని వల్లే మా బాబు మృతి, బాలుడు తండ్రి షాకింగ్ కామెంట్స్

పవన్ అభిమాని నిరంజన్ ఇష్యూ.. పేర్ని నాని వల్లే మా బాబు మృతి, బాలుడు తండ్రి షాకింగ్ కామెంట్స్
Advertisement

Hanumkonda: రాజకీయాలు హుందాగా ఉండాలి. ప్రతీ అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తే ప్రజల్లో ఉన్న కాస్త ఇమేజ్ పోతోంది. వైసీపీ విషయంలో అదే జరుగుతుందా? జనసేన అధినేత పవన్ హనుమకొండ టూర్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని చేసిన వ్యాఖ్యల వల్ల మా బాబు చనిపోయాడని వ్యాఖ్యానించాడు నిరంజన్ తండ్రి. అసలేం జరిగింది?

పవన్ హనుమకొండ టూర్ వ్యవహారం కొత్త మలుపు-జూన్ 17న హనుమకొండలో అనారోగ్యంతో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్‌ను నటుడు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. దీన్ని రాజకీయం చేసింది వైసీపీ. నిరంజన్ వ్యవహారంపై పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై తొలిసారి నోరు విప్పారు నిరంజన్ తండ్రి. పేర్నినాని వ్యాఖ్యల వీడియోను మా బాబు చూసి బాధపడ్డాడని, ఏకంగా 200 సార్లు ఆ క్లిప్ చూశాడని అన్నాడు.

Advertisement

పేర్నినాని వ్యాఖ్యలపై కౌంటర్-అప్పటివరకు హ్యాపీగా ఉన్న నిరంజన్, ఆ వీడియో చూసి ఒక్కసారి దిగాలు పడ్డాడని మనసులోని మాట బయటపెట్టాడు. మా బాబు చనిపోయాడంటే అందుకు కారణం పేర్నినాని అని బల్ల గుద్ది మరీ చెప్పాడు. పవన్ పై వ్యాఖ్యలు చేసినందుకు మా బాబు కుమిలిపోయాడని, రెండురోజులు భోజనం చేయలేదన్నాడు. పేర్నినానికి బుద్ధి ఉండాలని, అతనికి పిల్లలు ఉన్నారని గుర్తు చేశారు.

ఆయన రాజకీయ నాయకుడు ఎలా అయ్యాడో తెలీదన్నారు. పవన్ రాజకీయంగా రాలేదని, కేవలం మానవత్వంలో వచ్చారని గుర్తు చేశారు. పేర్ని నాని మాటలకు చిన్నపిల్లల మనసు విరిగిపోయిందంటే.. పెద్దవారికి ఇంకెంత బాధపడి ఉంటారో ఒక్కసారి ఆలోచించాలన్నారు. పవన్ వచ్చిన తర్వాత మా బాబుకు బతుకుతాడని అనుకున్నామని, అంత హ్యాపీగా ఫీలయ్యాడని వివరించాడు నిరంజన్ తండ్రి.

Advertisement

పేర్నినాని వ్యాఖ్యలకు పిల్లాడి మనసు విరిగిపోయింది-నిరంజన్‌ను పరామర్శించేందుకు అభిమాని ఇంటికి వెళ్లాడు పవన్ కళ్యాణ్. వారికి ధైర్యం చెప్పడమే కాకుండా భవిష్యత్తులో ఓజీ-2 సినిమా కలిసి చూస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పవన్ కోరిక నెరవేరక ముందే నిరంజన్ జూలై 8న ఈ లోకాన్ని విడిచిపెట్టిన విషయం తెల్సిందే. నిరంజన్ మృతితో అతడి ఫ్యామిలీ, పవన్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ALSO READ: కోట్ల ఆస్తి రాసిస్తే.. చెట్టు కింద నిలబెట్టారు! కన్నకొడుకుల చేతిలో మోసపోయిన కన్నతల్లి

నిరంజన్‌ను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో పవన్ నుద్దేశించి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పేర్నినాని వ్యవహారంపై ఏపీ-తెలంగాణ రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఏపీలో ఈ విధంగా రాజకీయాలు చేస్తారా? అంటూ నవ్వుకుంటున్నారు. బతికున్నవాళ్లను చంపేస్తారా? అదే పనిగా ఆ పార్టీ పెట్టుకుందా? అంటూ సోషల్ మీడియాలో వైసీపీని ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు.

 

 

 

 

 

Related News

వివేకా హత్య కేసు సాయంత్రానికి కొత్త మలుపు, అవినాష్ అరెస్టుకు సంకేతాలు! ఇవాళ విచారణకు

ఏపీలో స్థానిక ఎన్నికల ఫైట్.. పత్తా లేని వైసీపీ, జోష్ లేక డీలా పడుతున్న కేడర్

లోకల్ బాడీ ఎన్నికలపై విజయసాయిరెడ్డి పలుకులు, రూలింగ్ పార్టీకి అనుకూలం, పవన్‌పై కూడా

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు, కూటమిలో సీట్లు సర్దుబాటు.. 4:1 ఫార్ములాలో జనసేన-బీజేపీ, మిగతా సీట్లలో టీడీపీ

ఒక్క క్యూఆర్ కోడ్‌తో బిడ్డ ప్రాణాలు సురక్షితం.. ఏపీ పోలీసులు సూపర్ ఐడియా..?

వైఎస్ జగన్‌కి బిగ్ షాక్.. జనసేనలోకి వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతలు జంప్?

కృష్టా జిల్లా మున్సిపాలిటీల్లో షాకింగ్ న్యూస్.. మారిన రాజకీయ ముఖచిత్రం!

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. పార్టీ కండువా కప్పిన పవన్!

Big Stories

Advertisement
×