E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. అశ్విన్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. దొంగగా మారిన పల్లవి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. అశ్విన్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. దొంగగా మారిన పల్లవి..
Advertisement

Intinti Ramayanam Today Episode july 14th: పల్లవి లేవు ఇంకా పడుకొని ఉన్నావే అని అవని అంటుంది.. అయితే ఏం చేయాలి లేచి అని పల్లవి అంటుంది.. ఇంత పొద్దెక్కి వారికి ఇంకా పడుకొని ఉంటావా.. మీ ఆయన మా ఆయన ఇద్దరు బిజినెస్ పని మీద బయటకు వెళ్లడానికి రెడీ అయ్యి కూర్చుని ఉన్నారు.. భర్త బయటికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్లు ఇంట్లో ఇలా పాచి మొహంతో ఉంటే ఆ పని జరుగుతుందా..? నువ్వు లేచి కాఫీ తాగి రెడీ అవ్వు అని అంటుంది.. ఈ ఇంట్లో కూడా నన్ను ప్రశాంతంగా పడుకొనివ్వరా? పొద్దున్నే లేచినప్పటి నుంచి చిరాకు తెప్పిస్తుంటారు అని పల్లవి సీరియల్స్ అవుతుంది. ఇక మీనాక్షికి కాఫీ తెచ్చి ఇవ్వగానే అవని పల్లవికి ఇచ్చే వారిని అడుగుతుంది.. మీ ముద్దుల కూతురుకి కాఫీ ఇచ్చానులే అని అవని అంటుంది..

మళ్లీ లాయర్ గా మారిన శ్రీకర్..

అన్నదమ్ములు కలిసి స్టార్ట్ చేసిన బిజినెస్ ని మళ్లీ మొదలు పెట్టాలని అనుకుంటారు. ఈమధ్య కొన్ని అవాంతరాలు ఎదురవడంతో ఆ బిజినెస్ ఆగిపోయింది.. ఇప్పుడు మళ్లీ దాన్ని స్టార్ట్ చేసి వాళ్ళ నాన్న కోరికలు తీర్చాలి అని ముగ్గురు అన్నదమ్ములు అనుకుంటారు.. అయితే శ్రీకరు మళ్లీ లాయర్ కోటులో కనిపించడంతో ఏంట్రా మళ్లీ లాయర్ గా మారిపోయావు అని అనగానే నేను మళ్ళీ లాయర్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టాలని అనుకుంటున్నాను అన్నయ్య మీతో పాటు బిజినెస్ దగ్గరికి వచ్చి ఆ తర్వాత నుంచి మళ్లీ నేను కోర్టుకు వెళ్తాను అని శ్రీకర్ అంటాడు.. బయట అవని శ్రియ కోసం మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళందరూ బయటకు రావడం చూసి అవనీ శ్రియ అక్కడికి వెళ్తారు.. బాబుతో శ్రీయాను ఎదురు రమ్మని చెప్తే.. కొత్తగా ఇప్పుడు మార్చుకోవడం ఎందుకు అక్క నువ్వే బాబుని తీసుకుని ఎదురుగా రా అని శ్రేయ అనడంతో ఎంతగా మారిపోయింది అని అవని అనుకుంటుంది.

పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్..

Advertisement

శ్రీయ లోపలికి వెళ్ళగానే అత్తయ్య బాబు నిద్రపోతున్నాడు. నేను వాష్ రూమ్ కి వెళ్ళొస్తాను మీరు ఒకసారి బాబుని చూస్తూ ఉండండి అని అంటుంది. దానికోసం ఇంతగా బ్రతిమలాడాలా వెళ్లే శ్రమ అని పార్వతి అంటుంది.. అయితే శ్రీయా వెళ్లగానే.. పార్వతి స్టవ్ మీద పాలు పెట్టాను వేరే పని ఉంది అని అనుకుంటూ ఉంటుంది.. అప్పుడే ఎదురుగా వచ్చిన పల్లవి నేను పిలుస్తుంది. పల్లవి నువ్విలార ఒకసారి ఈ బాబును చూస్తూ ఉండు నేను వంట గదిలో పని ఉంది చూసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది.. అయితే వీడిని నేను చూడాలని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది.. ఫోన్ రావడంతో పక్కకు వెళ్లి మాట్లాడుతూ ఉండగా వాడు ఏడుస్తూ ఉంటాడు.. అది చూసినా కూడా పల్లవి ఏ ఆపు అంటూ అంటుందే తప్ప.. మళ్లీ ఫోన్ మాట్లాడుకుంటూ ఉండగా అవన్నీ అది చూసి కొంచమైన బుద్ధుందా… బాబు ఇంతగా ఏడుస్తుంటే ఫోన్ మాట్లాడుకుంటూ అలా ఉన్నావేంటి అని పల్లవికి వార్నింగ్ ఇస్తుంది.

పల్లవికి దిమ్మతిరిగే షాక్..

పల్లవి నేను అర్జెంటుగా కలవాలి నువ్వు రా అని అశ్విన్ తనకి ఫోన్ల మీద ఫోన్లు చేసి రమ్మని పిలుస్తాడు.. అక్కడికి వెళ్లిన పల్లవి మళ్లీ నా లైఫ్ లోకి ఎందుకు వచ్చావు? ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని అడుగుతుంది.. నా జీవిత ని నాశనం చేసిన నిన్ను అంత తొందరగా వదిలిపెడతానని ఎలా అనుకున్నావు అని అశ్విన్ అంటాడు. నీ జీవితాన్ని నేను ఎందుకు నాశనం చేశాను. అదేదో అనుకోకుండా అలా జరిగిపోయింది ఇప్పుడు నువ్వు నా మీద రివెంజ్ తెచ్చుకోవాలి అని అనుకుంటున్నావా అని పల్లవి అడుగుతుంది. నీ వల్లే నేను జైలుకు వెళ్లి వచ్చాను. అయితే ఇప్పుడు నీకేం కావాలి చెప్పు అని పల్లవి అడుగుతుంది. నాకు ఒక పది లక్షలు డబ్బులు ఇప్పుడే కావాలి. నీ ఆస్తులు నీకు తిరిగి వచ్చేసాయి కదా నాకు పది లక్షలు కావాలి అని అనగానే పల్లవి ఫ్యూజుల్ఎగిరిపోతాయి.. పది లక్షలు ఇప్పుడు ఎక్కడ నుంచి తీసుకురావాలి అని పల్లవి అంటుంది. ఆ 10 లక్షలు నేను ఎలాగోలాగా అరేంజ్ చేస్తాను నువ్వు మళ్ళీ నా జీవితంలోకి రావు కదా అని పల్లవి అడుగుతుంది. నువ్వు నాకు ఆ పది లక్షలు ఇస్తే నేను మళ్ళీ నీ జీవితంలోకి రాను అని అతను అనగానే పల్లవి సరే నేను తెస్తాను అని వెళ్ళిపోతుంది.

పల్లవి కి క్లాస్ పీకిన అవని..

Advertisement

తర్వాత అందరూ బయట కూర్చుని బాబుతో ఆడుకుంటూ ఉండగా.. భానుమతి మాత్రం అవని పై సీరియస్ గానే ఉంటుంది. ఈ అవని తన మంచితనంతో అందరినీ తన వైపు తిప్పుకుంది. ఇప్పుడు బాబుని కూడా తను ఎంత గొప్పగా చూసుకుంటుంది అని తిట్టుకుంటూ ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా బాబు తొందరగా పెరిగి మిమ్మల్ని అందరిని పిలిస్తే బాగుంటుంది అని నవ్వుకుంటూ సరదాగా ఉంటారు. అప్పుడు ఇంట్లోకి పల్లవి సడన్గా ఎంట్రీ ఇస్తుంది. వీళ్ళందరూ కలిసి నవ్వుకుంటూ ఉండగా చూసిన పల్లవి ఎలా నవ్వుకుంటున్నారో చూడండి అని ఆవేశంగా ఉంటుంది.. భానుమతి నీకు పిల్లలు పుట్టింటే మీ పిల్లలు కూడా అంతే సంతోషంగా చూసుకునేవారు కదా మీ చేతులారా నువ్వే ఆ సంతోషాన్ని దూరం చేసుకున్నావు అని మనసులో అనుకుంటుంది.. పిల్లల్ని ఎత్తుకుంటే నీకు కూడా పిల్లలు పుడతారు కదమ్మా అని పార్వతి అంటే నాకు పిల్లలు ఎత్తుకోవడం అలవాటు లేదు అత్తయ్య నాకు ఇష్టం లేదు అని చెప్తుంది.. అయితే నా భర్త నాతో కాపురం చేయడం లేదు నాకు పిల్లలు ఎలా పుడతారు అని ఆరోజు అంతగా గొడవ చేసావు కదా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటి అని పల్లవి క్లాస్ పీకుతుంది..

బాబుకోసం గోల్డ్ చేయించిన అవని..

బాబు కోసం నేను ఈ కడియాలు చేయను చేయించాను అత్తయ్య బారసాల కోసం ఇవి బాగుంటాయి కదా అని అవని చూపిస్తుంది. బాబు మన ఇంటికి ఎంతో కలను తీసుకుని వచ్చాడు వాడి కోసమే ఇవన్నీ చేయించాను అని అవని అంటుంది.. అవన్నీ చూసిన పార్వతీ నువ్వు చాలా మంచి దానివి అవని.. నేను అనుకునే లోపల అన్ని చేసేస్తావు… చాలా మంచి దానివి అవని అని పార్వతీ పొగిడిస్తూ ఉంటుంది.. అనాధగా నేను మీ ఇంట్లోకి వచ్చిన మీరు చూపించిన ప్రేమ మీ అలవాట్లే నాకు వచ్చే అత్తయ్య అని అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :’పొదరిల్లు ‘ శైలు ఏం చదివిందో తెలుసా..?

Related News

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ..ఆ మూవీ స్టైల్ లో సీమంతం!

Podarillu Kanna : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కన్నా అవుట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Big Stories

Advertisement
×