E-Paper
Advertisement

సింగరేణిని ‘ATM’లా వాడి.. రూ.50 వేల కోట్ల బాకీ పెట్టారు.. కాంగ్రెస్, BRSలపై కిషన్ రెడ్డి ఫైర్!

సింగరేణిని ‘ATM’లా వాడి.. రూ.50 వేల కోట్ల బాకీ పెట్టారు.. కాంగ్రెస్, BRSలపై కిషన్ రెడ్డి ఫైర్!
Advertisement

Kishan Reddy: గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, తప్పుడు విధానాల వల్లే సింగరేణి ఉద్యోగుల సంఖ్య 70 వేల నుండి 40 వేలకు పడిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆదాయం గణనీయంగా తగ్గిన ఈ సమయంలో ‘తాడిచర్ల-II’ తో పాటు ‘నైనీ కోల్ బ్లాక్’ లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యేలా మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం.. కొండంత భరోసా ఇచ్చిందన్నారు. తాడిచర్ల బొగ్గు గనులను సింగరేణికి కేంద్రం కేటాయించిన సందర్భంగా కొత్తగూడెం క్లబ్‌లో బీజేపీ నిర్వహించిన ‘భరోసా యాత్ర’ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

20 ఏళ్లుగా కార్మికులు కోరుతున్న ఈ బ్లాక్‌ను ప్రధాని మోదీ.. సింగరేణి (SCCL)కి కేటాయించినట్లు చెప్పారు. దీని ద్వారా రాబోయే మూడు దశాబ్దాల వరకు బొగ్గు ఉత్పత్తికి ఢోకా ఉండదన్నారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఎలాంటి ఆక్షన్ లేకుండా నేరుగా కేటాయించిన ఏకైక బ్లాక్ ‘తాడిచర్ల-2 అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. గతంలో బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సంస్థకు రావాల్సిన బాకాయిలు ఇవ్వకుండా ఆర్థిక సంక్షోభంలోకి సింగరేణిని నెట్టాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ రెండు ప్రభుత్వాలు సింగరేణిని ఏటీఎంలా వాడుకుని దాదాపు రూ.50 వేల కోట్లు బాకీపడ్డాయని చెప్పారు.

Advertisement

Also Read: ధర తక్కువ.. గాలి ఎక్కువ.. మార్కెట్లో దుమ్మురేపుతున్న స్టాండ్ ఫ్యాన్లు ఇవే!

మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు.. ఎన్. రామచందర్ రావు ఇదే కార్యక్రమంలో పాల్గొని అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. రాబోయే రోజుల్లో వేలాది మంది సింగరేణి కార్మికుల భవిష్యత్తుకు భరోసా కల్పించనుందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన కృషి ఫలితంగానే నైని, తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌లు ఎస్‌సీసీఎల్‌కు కేటాయించబడ్డాయని రాంచందర్ అన్నారు.

Advertisement

Also Read: వానకాలంలో కూలర్ మొరాయిస్తోందా? ఈ 5 చిట్కాలతో.. సూపర్ కూలింగ్ పక్కా!

Related News

భక్తి ముసుగులో రక్తి క్రీడ.. జూబ్లీహిల్స్‌లో గురూజీల నిజస్వరూపం బట్టబయలు!

హైటెక్స్ వేదికగా ‘సమాఖ్య-2026’ బిజినెస్ మీట్ ప్రారంభించిన సీఎం రేవంత్!

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ!

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×