Shabad Murder: షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ బెయిల్ పై బయటకు రావడానికి వెనక ఏం జరిగింది? అతడు బెయిలుపై విడుదల కావడం వెనక పెద్ద ఎత్తున డీల్ సెట్ అయ్యిందా? బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణలేంటి? దీనిపై పోలీసుల రియాక్షనేంటి? రాజ్ కుమార్ తనకన్నా పెద్దదైన ట్యూషన్ టీచర్నే ప్రేమించి పెళ్లాడ్డం మాత్రమే కాదు.. పాలుగారే బుగ్గలున్న ఇద్దరు పిల్లల తండ్రి కూడా. భార్యా పిల్లలతో పచ్చటి కాపురం చేసుకోవల్సిన వాడు.. బెట్టింగులు, జూదాలతో వ్యసనాలకు లోనయ్యాడు. ఏకంగా రూ.2 కోట్ల మేర అప్పుల పాలయ్యాడు. ఉన్న చెడ్డ అలవాట్లు చాలవన్నట్టు ఒక బాలికపై కన్నేశాడు. ఈ విషయం గుర్తించిన భార్య అతడ్ని అడ్డుకోవడం కూడా మైండ్‌లో పెట్టుకున్నాడు.
బాలికను లైంగికంగా వేధించడం మాత్రమే కాదు.. మీ నాన్నను చంపినట్టు చంపేస్తానని బెదిరించాడు కూడా. ఈ విషయంలోని తీవ్రత గుర్తించిన బాలిక తల్లి లక్ష్మి, రాజ్ కుమార్ పై పోక్సో కేసు పెట్టింది. మే 16న కేసు పెడితే, మే 26న అతడ్ని అరెస్టు చేశారు. ఇక్కడే పోలీసులపై డౌట్ నెంబర్ వన్ వచ్చింది. కేసు పెట్టిన పది రోజుల తర్వాత అరెస్టు చేయడమేంటి? అన్నదొక ప్రశ్న కాగా రెండో క్వశ్చిన్ మార్క్. అతడు బెయిల్ పై ఎలా విడుదలయ్యాడు? ఒక వేళ విడుదలైనా బాధిత కుటుంబాన్ని పోలీసులు హెచ్చరించలేదు ఎందుకని?
అప్పటికీ బాధిత కుటుంబ సభ్యులు అతడి ద్వారా తమకు ప్రాణ హాని ఉందని పోలీసులకు ఒకటికి పది సార్లు చెప్పారు. ఇక తన భార్యతో రాజ్ కుమార్ చెప్పిన విషయమైతే అతి భయానకం. యూట్యూబర్ వైష్ణవిని చంపితే ఏం చేశారు? ఇదీ అంతే- అంటూ అతడు పోలీసుల పట్ల, వారి డ్యూటీ స్పిరిట్ పై చేసిన కామెంట్లు తీవ్ర ఆందోళనకరం. అతడి చుట్టూ ఇంత విష వలయం అల్లుకుని కనిపిస్తుంటే, పోలీసులెంతో అప్రమత్తంగా ఉండాల్సింది. బాధిత కుటుంబాన్ని అలెర్ట్ చేయాల్సింది. వారడిగిన భద్రత ఇవ్వాల్సింది. కానీ ఇప్పుడేం జరిగింది.. బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు రాజ్ కుమార్ భార్యా పిల్లలు కూడా అతడి చేతిలో కడతేరిపోయారు. ఫలితం బాధిత కుటుంబంలోని దివ్యాంగురాలు- అనాథగా మిగిలిపోవల్సి వచ్చింది.
దీనంతటి వెనక ఇరవై లక్షల రూపాయల డీల్ ఉన్నట్టుగా తెలుస్తోంది. నిందితుడి తరఫు వారి నుంచి ఈ మొత్తం తీసుకుని అతడికి అనుకూలంగా బలహీన సెక్షన్లు నమోదు చేశారని ఆరోపిస్తున్నారు స్థానికులు.. అందువల్లే దర్యాప్తును పక్కదారి పట్టించారని వాపోతున్నారు బాధిత కుటుంబ సభ్యులు. ఆరోపణలు ఎదుర్కుంటున్న స్థానిక పోలీసు అధికారి ఒకరు ఇరవై లక్షల వ్యయంతో గ్రామంలో పందెం కోళ్ల ఫారం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
దీంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ విషయంలో స్పందించాల్సిన పోలీసులైతే ఒక క్లారిటీ ఇచ్చారు. ఎస్సై, దర్యాప్తు బలహీనపరిచేందుకుగానూ, పది వేల రూపాయలు లంచం తీసుకున్నట్టు సమాచారం ఉందంటున్నారు. ప్రస్తుతం సిట్యువేషన్ ఎలా ఉందో గమనిస్తే బాధ్యతారహితంగా వ్యవహరించినట్టు తేలడంతో షాబాద్ ఎస్సై రమేష్ ని సస్పెండ్ చేశారు. ఇరవై లక్షల డీల్ వ్యవహారంలో.. పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది.
Storey By: Appa Rao Big Tv
Also read: Chandrababu Fan: సీఎం చంద్రబాబుని కలిసేందుకు 13 ఏళ్ల బాలుడు సాహసం.. ఎవరికి చెప్పకుండా..!