E-Paper
Advertisement

Illegal Constructions: పటాన్‌చెరు ఇంద్రేశంలో అక్రమ నిర్మాణాల కలకలం

Illegal Constructions: పటాన్‌చెరు ఇంద్రేశంలో అక్రమ నిర్మాణాల కలకలం
Advertisement

Illegal Constructions: స్వేచ్చ బ్యూరో: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీ రామేశ్వరం బండలో అక్రమ నిర్మాణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయం వెనకాలే అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ నిర్మాణాలు..

భవన నిర్మాణాలకు తప్పనిసరిగా ఉండాల్సిన అనుమతులు, సెట్‌బ్యాక్‌లు, పార్కింగ్, భద్రతా ప్రమాణాలను పక్కనబెట్టి నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అక్రమ నిర్మాణాలు పూర్తయ్యే వరకు అధికారులు మౌనం పాటించి, తర్వాత జరిమానాలతో సరిపెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ కార్యాలయానికి సమీపంలోనే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు సాగుతున్నా చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

Also read: Gaddam Vivek: మీకు పబ్లిసిటీ పిచ్చిపట్టిందా.. కేటీఆర్, హరీష్ రావు పై మంత్రి వివేక్ షాకింగ్ కామెంట్స్!

అండదండలు ఉన్నాయా..?

అధికారులు తెలిసీ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారా? లేక అక్రమ నిర్మాణాలకు అండదండలు ఉన్నాయా? అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. నిర్మాణ ప్రమాణాలు పాటించకుండా భవనాలు నిర్మించడం వల్ల భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్, టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రత్యేక విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also read: Chandrababu Fan: సీఎం చంద్రబాబుని కలిసేందుకు 13 ఏళ్ల బాలుడు సాహసం.. ఎవరికి చెప్పకుండా..!

Related News

భక్తి ముసుగులో రక్తి క్రీడ.. జూబ్లీహిల్స్‌లో గురూజీల నిజస్వరూపం బట్టబయలు!

హైటెక్స్ వేదికగా ‘సమాఖ్య-2026’ బిజినెస్ మీట్ ప్రారంభించిన సీఎం రేవంత్!

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ!

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×