E-Paper
Advertisement

Telangana Nominations: మంచి రోజు.. ఇవాళే కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు..

Telangana Nominations:  మంచి రోజు.. ఇవాళే కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు..
Advertisement

Telangana Election Nominations(Political news in telangana): లోక్‌సభ నాలుగోదశ ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు షెడ్యూల్ విడుదలైంది.

గురువారం నుండి 25 వరకు అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నారు అధికారులు. అయితే మొదటి నాలుగు రోజులు నామినేషన్లు వేయనున్నారు అభ్యర్థులు. 18, 19, 20, 21న తిథులు మంచివి కావడంతో అదే రోజు నామినేషన్లు వేయాలని ప్లాన్ చేసుకున్నారు నేతలు.

chamala kirankumar neelam madhu election nominations
Nominations for Lok Sabha for Telangana chamala kirankumar neelam madhu
Advertisement

18 దశమి, 19 ఏకాదశి, 20 ద్వాదశి, 21 త్రయోదశి రోజుల్లో తెలంగాణలోని వివిధ పార్టీలకు చెందిన  అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ముఖ్యంగా 18న మెదక్ అభ్యర్థి నీలం మధు, భువనగిరి నుండి చామల కిరణ్‌కుమార్ రెడ్డి నామినేషన్ వేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రెండో సెట్ నీలం మధు 20న సీఎం రేవంత్‌రెడ్డి‌తో కలిసి వేయనున్నారు. చామల కిరణ్‌కుమార్ రెడ్డి 24న రెండో సెట్ వేయనున్నారు. 19న పెద్దపల్లి అభ్యర్థి వంశీ‌కృష్ణ.. అదేరోజు మహబూబ్‌నగర్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, మహబూబాబాద్ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో 21న భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ చేపట్టనుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు హాజరవుతున్నారు.

Tags

Related News

Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

ఇన్‌స్టాగ్రామ్ లవ్ డ్రామా.. 14 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!

SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

Big Stories

Advertisement
×