BigTV English

Bethi Subhas Reddy Resigned to BRS: బీఆర్ఎస్‌కు షాక్.. సార్ వెళ్లొస్తా.. బేతి సుభాష్‌రెడ్డి గుడ్ బై!

Bethi Subhas Reddy Resigned to BRS: బీఆర్ఎస్‌కు షాక్.. సార్ వెళ్లొస్తా.. బేతి సుభాష్‌రెడ్డి గుడ్ బై!

Ex MLA Bethi Subhas Reddy Resigned BRS: గులాబీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీని ముఖ్యనేతలు వీడుతున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు కారు దిగేశారు. కొందరు కాంగ్రెస్‌లోకి, మరికొందరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉన్న కొద్దీమంది నేతలు కూడా లోక్‌సభ ఎన్నికలకు ముందు వెళ్లిపోవాలని డిసైడ్ అయిపోయారు. తాజాగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేశారు.


రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపారాయన. మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి రాజీనామా వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ విషయంలో పార్టీ హైకమాండ్ ఎవరినీ సంప్రదించకుండానే లక్ష్మారెడ్డికి కేటాయించడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

BRS Ex MLA Bethi Subhas Reddy Resigned
BRS Ex MLA Bethi Subhas Reddy Resigned

Also Read: Telangana politics: రంగంలోకి సీఎం రేవంత్.. ఎక్కడెక్కడ?


అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత కనీసం నియోజకవర్గాల నేతలను సంప్రదించకుండా  సొంతంగా నిర్ణయం తీసుకోవడంపై ఆయన కాసింత ఆగ్రహంగా ఉన్నారు. దీనికితోడు ముఖ్యనేతలంతా కారు దిగిపోవడంతో ఇక ఆ పార్టీ పనైపోయిందని భావించారు. చివరకు రాజీనాామా ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు.

బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి. ఉద్యమ కారుడు ఈటెల రాజేందర్‌కు కమలం పార్టీ టికెట్ ఇచ్చిందని, ఆయనను గెలిపించేందుకు నిర్ణయించు న్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. బేతి బాటలోనే మరికొందరు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో మరికొందరు నేతలు కారు దిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎండాకాలం వేళ.. కారులో ఈ ఉక్కపోత ఏంటో..?

Tags

Related News

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Big Stories

×