E-Paper
Advertisement

Telangana Elections : పోలింగ్‌పై అధికారుల ఫోకస్‌.. ఓటింగ్‌ శాతం పెంచే దిశగా ప్రయత్నాలు..

Telangana Elections : పోలింగ్‌పై అధికారుల ఫోకస్‌.. ఓటింగ్‌ శాతం పెంచే దిశగా ప్రయత్నాలు..
Advertisement

Telangana Elections : తెలంగాణలో ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో పోలింగ్‌ శాతంపై అధికారులు దృష్టి సారించారు . ప్రతీ ఒక్కరు తమ ఓటు వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పోలింగ్‌ శాతంపై ఫోకస్‌ పెట్టారు. ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు పలు కార్యక్రమాలు చేపడతున్నారు. గత ఎన్నికల్లో పల్లెలు, తండాల్లో అనుకున్న మేర ఓటింగ్‌ నమోదైతే.. ఉద్యోగులు, విద్యావంతులు, వలస వచ్చినవారు, కార్మికులు అధికంగా ఉండే ప్రాంత ప్రజలు ఓటు వేయడంలో వెనుకపడ్డారు. దీంతో ఈసారి వారిచేత కూడా ఓటు వేయించి పోలింగ్‌ శాతాన్ని పెంచే పనిలో ఉన్నారు అధికారులు.

గత 2014, 2018లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌ శాతాన్ని చూస్తే.. 2014 కంటే 2018లో 1.62 శాతం పెరిగింది. 2014 ఎన్నికల్లో 65.72 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. 2018 ఎన్నికల్లో 67.34 శాతం నమోదైంది. గత ఎన్నికల్లో అత్యధికంగా షాద్‌నగర్‌లో 87.57 శాతం నమోదైంది. 2018 ఎన్నికల్లో అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 48.51 శాతంగా నమోదైంది. తెలంగాణలో అత్యధికంగా ఓటర్లు ఉన్న శేరిలింగంపల్లిలో పోలింగ్‌ శాతం అత్యల్పంగా నమోదుకావడంపై అధికారులు ఆరా తీశారు. విద్యావంతులే ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఈ సారి శేరిలింగంపల్లి పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తూ అవగాహన కార్యక్రమాల్ని చేపడుతున్నారు.

Advertisement

తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో వికారాబాద్‌ జిల్లా వాసులు ముందుస్థానంలో ఉన్నారు. గత ఎన్నికల ఓటింగ్‌ శాతాన్ని చూస్తే… 2014 ఎన్నికల్లో 69.66 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. 2018 ఎన్నికలో 76.92 శాతం నమోదైంది. పోలింగ్‌ శాతంలో రంగారెడ్డి జిల్లాను మించిపోయింది. అలాగే మేడ్చల్‌ జిల్లాలోనూ అంతంత మాత్రంగానే పోలింగ్‌ శాతం నమోదైంది. 2014 ఎన్నికల్లో 52శాతం పోలింగ్‌ నమోదు కాగా.. 2018 ఎన్నికల్లో 55.62 శాతం నమోదైంది. స్వల్పంగా 0.62 శాతం పోలింగ్‌ పెరిగింది.

ఈ లెక్కలను బట్టి గ్రామాల్లో పోలింగ్‌ శాతం పెరగుతోంటే పట్టణాల్లో మాత్రం తగ్గుతుంది. దీంతో పట్టణాల ఓటింగ్‌పై దృష్టి సారించారు అధికారులు. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌ వంటి ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేశారు. డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు, యువతకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మహిళలతో ర్యాలీలు నిర్వహించి ఓటు ప్రాముఖ్యత గురించి వివరిస్తున్నారు. బస్టాండు, రైల్వే స్టేషన్లతో పాటు జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బంది ఇంటింటి వెళ్లి ఓటు ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. సోషల్‌ మీడియా వాడకం ఎక్కువైనందున సామాజిక మాద్యమం ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×