E-Paper
Advertisement

మెడికల్ కాళేజీలకు బిగ్ షాక్.. ఇకపై ఆ సర్టిఫికేట్లు చెల్లవు..?

మెడికల్ కాళేజీలకు బిగ్ షాక్.. ఇకపై ఆ సర్టిఫికేట్లు చెల్లవు..?
Advertisement

NMC New Rules: స్వేచ్చ బ్యూరో: వైద్య కళాశాలల్లో ఫ్యాకల్టీ నియామకాలు, ప్రమోషన్ల విషయంలో నేషనల్ మెడికల్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తింపు లేని విభాగాలు, యూనిట్లలో పీజీ శిక్షణ బోధనా అనుభవం ఇకపై చెల్లదని స్పష్టం చేస్తూ ఎన్ ఎంసీ ఓ అడ్వైజరీ రిలీజ్ చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ రికార్డుల ప్రకారం.. అనుమతించబడిన పీజీ సీట్లు, అవసరమైన మౌలిక సదుపాయాలు, నిర్ణీత ఫ్యాకల్టీ సంఖ్య ఉన్న గుర్తింపు పొందిన విభాగాల నుంచి మాత్రమే బోధనా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఎన్ఎంసీ పేర్కొంది.

ఆదేశాలు జారీ..

ఇటీవల కొన్ని సంస్థలు గుర్తింపు లేని యూనిట్ల ప్రాతిపదికన బోధనా అనుభవ ధృవీకరణ పత్రాలను జారీ చేస్తున్నట్లు కమిషన్ దృష్టికి రావడంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. పీజీ పరీక్షలకు, పీజీ టీచర్, గైడ్, ఫ్యాకల్టీ పోస్టుల నియామకం, ప్రమోషన్లు, అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ అవసరాలకు సంబంధించిన వ్యవహారంలో ఈ రూల్ వర్తిస్తుందని ఎన్ ఎంసీ పేర్కొన్నది.

Advertisement

Also Read: సీఎం రేవంత్‌కి లేఖ రాసిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

నిభందనలకు విరుద్దం

అయితే వైద్య కళాశాలలు ,అనుబంధ విశ్వవిద్యాలయాలు బోధనా అనుభవ ధృవీకరణ పత్రాలను జారీ చేసేముందు, సదరు విభాగం ఎన్ఎంసీ గుర్తింపు పొందిందో లేదో క్షుణ్ణంగా తనిఖీ చేయాలని కమిషన్ అండర్ సెక్రటరీ మనీష్ కుమార్ మిట్టల్ ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్లు జారీ చేస్తే ఆయా విద్యా సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఆరోగ్య విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, వైద్య విద్య డైరెక్టర్లకు సమాచారం పంపారు.

Advertisement

Also read: బీఆర్ఎస్ నేతలకు చురకలంటించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×