E-Paper
Advertisement

PM Modi | బీసీలకు మోసం చేసిన బీఆర్ఎస్.. సీఎంగా బీసీ అభ్యర్థి : ప్రధాని మోదీ

PM Modi | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో మంగళవారం జరిగిన బీసీ ఆత్మీయ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఇంతకు ముందు కూడా బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇదే మాట అన్నారు.

PM Modi | బీసీలకు మోసం చేసిన బీఆర్ఎస్.. సీఎంగా బీసీ అభ్యర్థి : ప్రధాని మోదీ
Advertisement

PM Modi | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో మంగళవారం జరిగిన బీసీ ఆత్మీయ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఇంతకు ముందు కూడా బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇదే మాట అన్నారు.

బీసీ ఆత్మీయ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “మీ ఆశీర్వాదంతోనే నేను ప్రధాని అయ్యాను. నేను ప్రధాని అయ్యేందుకు ఎల్బీ స్టేడియం వేదిక అయ్యింది. అదే సంకల్పంతో తెలంగాణకు బీసీ సీఎం అవుతారు. ఇక్కడి నుంచే తెలంగాణకు బీసీ సీఎం రాబోతున్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీపైనే విశ్వాసంతో ఉన్నారు. ఈ నెలతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. అన్ని వర్గాల ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారు. 9 ఏళ్లుగా BC, SC, ST విరోధి అధికారంలో ఉన్నారు” అని చెప్పారు.

Advertisement

నిధులు, నీళ్లు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. కానీ అవి ప్రజలకు అందడంలేదని ప్రధాని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక బీసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు.

బీఆర్ఎస్‌ పార్టీ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయకుండా కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మోదీ మండిపడ్డారు. తెలంగాణలో కమలం వికసిస్తేనే .. ప్రజల జీవితాల్లో వికాసం కనిపిస్తుందన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి వస్తుందని ప్రధాని మోదీ చెప్పారు.

Advertisement

3 దశాబ్దాల ప్రగతిని ఒక్క దశాబ్దంలోనే మోదీ సాధించారు : పవన్‌ కళ్యాణ్

తెలంగాణ ఏర్పడడానికి సకల జనులు సమరం ముఖ్యకారణమని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మీయ సభలో బీజేపీ తరపున పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. “జల్‌, జంగల్‌, జమీన్‌ అంటూ కుమురం భీం పోరాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం. రాష్ట్రం వచ్చి కూడా ఫలితాలు అందరికీ అందని పరిస్థితి. మోదీ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే ఆర్టికల్‌ 370 రద్దు చేసేవారు కాదు. మహిళా బిల్లు తెచ్చేవారు కాదు. ఎన్నో కీలక నిర్ణయాలు మోదీ తీసుకునేవారు కాదు. భారతీయుల గుండెల్లో ధైర్యం నింపిన వ్యక్తి ప్రధాని మోదీ. 3 దశాబ్దాల ప్రగతిని ఒక్క దశాబ్దంలోనే మోదీ సాధించి చూపారు” అని పవన్‌ కళ్యాణ్ అన్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×