BigTV English

weight loss : బరువు తగ్గాలంటే ఈ గింజలు తినండి

weight loss : బరువు తగ్గాలంటే ఈ గింజలు తినండి
weight loss

weight loss : సబ్జా గింజలు ఇవి చూసేందుకు చిన్నగా ఉన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఊబకాయం, అధిక బరువుతో బాధపడేవారికి ఇవి చక్కగా పనిచేస్తాయి. వీటిని తింటే మనకు కడుపు నిండుగా ఉండటంతో పాటు ఆకలి వేయదు, దీంతో తొందరగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా శ్వాసకోస సమస్యలు ఉంటే గోరు వెచ్చటి నీళ్లలో కొద్దిగా తేనె, అల్లం రసంలో సబ్జా గింజలను వేసుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల దగ్గు, జలుబు సమస్యలను నివారించవచ్చు. జీర్ణ సమస్యలకు కూడా సబ్జా గింజలతో చెక్‌ పెట్టొచ్చు.


సబ్జా గింజలను నీటిలో వేసుకుని తింటే మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయి జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. ఇందులో ఉండే డైటరీ ఫైబర్‌ వల్ల మలబద్ధకం కూడా పోతుంది. గ్యాస్‌, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. గాయాలకు కూడా ఈ గింజలు బాగా పనిచేస్తాయి. సబ్జా గింజలను పౌడర్‌ చేసి దాన్ని గాయాలపై వేసి కట్టుకడితే తొందరగా తగ్గిపోతాయి. ఎలాంటి ఇన్ఫెక్షన్లు మీ దరిచేరవు. ఈ సబ్జా గింజలను నీళ్లలో వేసుకుని తింటే తలనొప్పి కూడా ఇట్టే మాయమవుతుంది. మైగ్రేన్ సమస్యలకు కూడా ఇది అద్భుత ఔషధం అని చెప్పవచ్చు. రక్త సరఫరాను మెరుగుపరిచి బీపీని కూడా కంట్రోల్‌లో పెడతాయి.

కీళ్లనొప్పులతో ఇబ్బంది పడేవారికి ఈ సబ్జా గింజలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ సబ్జా గింజల్లో టీ బయోటిక్‌, యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్ లక్షణాలు అనేకం ఉంటాయి. ఎలాంటి ఇన్ఫెక్షనైనా, అలర్జీనైనా వీటితో తరిమేయవచ్చు. డిప్రెషన్‌లో ఉన్నవారు వీటిని తింటే ఒత్తిడి, అలసట మీ దరిచేరదు. పంచదార వేయకుండా సబ్జా గింజల నీటిని తాగితే డయాబెటిస్‌ అదుపులోకి వస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు చాలా తగ్గుతాయి. నానబెట్టిన సబ్జాను పచ్చిపాలలో వేసి, కొన్ని చుక్కల వెనిలా కలిపి తాగితే టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారికి మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా సబ్జా గింజల నీరు తాగితే వేసవి కాలంలో ఇది చలవ చేస్తుంది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×