BigTV English

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Pocso Case: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఓ లేడీ కొరియోగ్రాఫర్ లైంగిక ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాయదుర్గం పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. ఆ కేసును అక్కడి నుంచి నార్సింగి పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. నార్సింగి పోలీసులు బాధితురాలి నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. తాజాగా, ఆ కేసులో పోక్సో సెక్షన్లు కూడా యాడ్ చేశారు. లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలు మైనర్ అని తేలడంతో.. జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదైంది. 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ముంబయి హోటల్‌లో బాధితురాలిపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేసినట్టు గుర్తించిన పోలీసులు పోక్సో సెక్షన్లు కూడా చేర్చారు. అంతకు ముందే జానీ మాస్టర్ పై సెక్షనర్ 376 (2) (ఎన్) రేప్, క్రిమినల్ ఇంటిమిడేషన్ (506), గాయపరచడం (323) కింద కేసు నమోదైంది.


లైంగిక దాడి ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపగా.. జానీ మాస్టర్ పరారయ్యారు. ప్రస్తుతం ఆయన అందుబాటులో లేరు. ఉత్తర భారతానికి పారిపోయినట్టు సమాచారం. లడాఖ్‌లో తలదాచుకున్నట్టు తెలుస్తున్నది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు జానీ మాస్టర్‌ను అరెస్టు చేయడానికి లడాఖ్ బయల్దేరారు. జానీ మాస్టర్‌ను అరెస్టు చేయడానికి ప్రత్యేక పోలీసు బృందం లడాఖ్‌కు ప్రయాణం అవుతున్నట్టు తెలిసింది. మొత్తం నాలుగు ప్రత్యేక బృందాలు ఆమె కోసం గాలిస్తున్నట్టు సమాచారం.

జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు రాగానే.. పవన్ కళ్యాణ్ పార్టీ ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకుంది. ఆయనను పార్టీ కార్యకలాపాల నుంచి దూరం పెట్టింది. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని, ఈ ఆదేశాలు తక్షణమే అమలవుతాయని ఆ పార్టీ పేర్కొంది. ఇక ఈ ఆరోపణల నేపథ్యంలోనే కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తాత్కాలికంగా తప్పించారు. ఇక ఫిలిం ఛాంబర్ కూడా ఆయనకు షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. నార్సింగి పోలీసులు ఈ వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తు చేస్తున్నారని, తాము కూడా తమ వంతు యాక్షన్ తీసుకుంటామని వెల్లడించింది.


Also Read: Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

ఢీ షోలో కంటెస్టెంట్‌గా పేరు సంపాదించుకున్న యువతిని.. జానీ మాస్టర్ టీం పని చేయడానికి ఆహ్వానించింది. ఆ టీంలో చేరిన తర్వాత ఓ సారి ముంబయిలో షూటింగ్ కోసం టూర్‌కు వెళ్లారు. అప్పుడు యువతి తల్లికి టికెట్ బుక్ చేయలేదు. ముంబయిలో ఓ హోటల్‌లో దిగిన యువతిని జానీ మాస్టర్ ఓ రూంకు పిలుచుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే.. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆమెకు అవకాశాల్లేకుండా కెరీర్‌ను నాశనం చేస్తానని జానీ మాస్టర్ బెదిరించినట్టు ఆమె ఫిర్యాదు చేసింది.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×