BigTV English

Banjarahills : బంజారాహిల్స్ రేప్ కేసు.. మూడురోజులైనా చర్యలేవి?

Banjarahills : బంజారాహిల్స్ రేప్ కేసు.. మూడురోజులైనా చర్యలేవి?

Banjarahills : బంజారాహిల్స్‌ రేప్‌ కేసు వ్యవహారంలో పోలీసుల తీరుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితుడు మురళి ముకుంద్‌ను రక్షించే పనిలో పోలీసులు పడ్డారంటూ విమర్శలు వస్తున్నాయి. FIR నమోదు చేసి..మూడు రోజులైనా నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేయకపోవటంతో… కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బాధితురాలిని భయపెట్టి మేనేజ్‌ చేసే పనిలో కొందరు అదృశ్య శక్తులు ఉన్నట్లు సమాచారం. నిందితుడు మురళి ముకుంద్‌కు పోలీసులు వత్తాసు పలుకుతూ.. అరెస్ట్‌ చేసే విషయంలో పోలీసులు కాలయాపన చేస్తున్నారు. తనను రేప్‌ చేసి తీవ్రంగా కొట్టారని పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు చేయగా.. FIRలో ఏ1-గా మురళి ముకుంద్‌, ఏ-2గా మురళి ముకుంద్‌ కొడుకు ఆకాష్ పేరు చేర్చారు.


ఇప్పటివరకూ బాగానే ఉన్నా… విచారణ పేరుతో కాలయాపన జరుగుతోందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితుల తరఫున రంగంలోకి దిగిన పెద్దలు.. అత్యాచారం కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భరోసా సెంటర్లో రెండు రోజుల క్రితం బాధితురాలి స్టేట్‌మెంట్ ఇచ్చింది. 9 గంటలపాటు స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్న పోలీసులు.. మరోసారి భరోసా సెంటర్‌కు బాధితురాలిని పిలిపించారు. ఆదివారం సాయంత్రం నుంచి విచారణ పేరుతో బాధితురాలిని భరోసా సెంటర్‌లోనే ఉంచారు.


Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×