Ponguleti Srinivas Reddy : ఎన్నికలకు కొద్దిరోజుల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనూహ్యంగా మంత్రి అయ్యారు. 2014లో వైసీపీ తెలంగాణ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన.. 2014 ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కొంతకాలానికి బీఆర్ఎస్ చేరారు. ఎన్నికలకు కొద్దిరోజులు ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పాలేరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో పొంగులేటి స్థానం దక్కించుకున్నారు.
పొంగులేటి ప్రొఫైల్ ..
2014లో తెలంగాణ వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం
2014లో ఖమ్మం నుంచి వైసీపీ ఎంపీగా గెలుపు
ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరిక
2014-2019 వరకు రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడు
2014 -2019 వరకు ఎనర్జీ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీలో సభ్యుడు
2023లో కాంగ్రెస్ పార్టీలో చేరిక
2023 ఎన్నికల్లో పాలేరు ఎమ్మెల్యేగా విజయం