E-Paper
Advertisement

Revanth Reddy : రేవంత్ తొలి స్పీచ్.. ఆ రెండు ఫైల్స్ పై సంతకం..

Revanth Reddy : రేవంత్ తొలి స్పీచ్.. ఆ రెండు ఫైల్స్ పై సంతకం..

Revanth Reddy : ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల ఫైల్ పై తొలి సంతకం చేశారు. తాను స్వయంగా ఇచ్చిన మాటను రేవంత్ నెరవేర్చారు. దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ అపాయింట్ మెంట్ ఆర్డర్ అందించారు. ఆమె ఉద్యోగం ఇచ్చే ఫైల్ పై రెండో సంతకం చేశారు. ప్రమాణస్వీకార వేదికపైనే రజినీకి ఉద్యోగ నియామక పత్రం అందించారు.

సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత రేవంత్ తొలిసారిగా మాట్లాడారు. త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. కానీ దశాబ్ద కాలంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం హత్యకు గరైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో 4 కోట్ల ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. భుజాలు కాయలు కాచేలా కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యకర్తలు ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధమయ్యారని.. 10 ఏళ్లు కష్టపడ్డ కార్యకర్తలను గండెల్లో పెట్టుకుంటామన్నారు. వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

4 కోట్ల ప్రజలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల ఆకాంక్షలను నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటైందన్నారు. ప్రజలకు సామాజిక న్యాయం జరుగుందని భరోసా ఇచ్చారు. ప్రగతి భవన్ చుట్టూ పెట్టిన ఇనుప కంచెలు బద్దలు కొట్టించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నానని.. ఇకపై ఎప్పుడైనా తెలంగాణ ప్రజలు ప్రగతి భవన్ లోకి రావచ్చని ఆహ్వానించారు. తమ ఆకాంక్షలను పంచుకోవచ్చని తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణను ప్రపంచంతో పోటీపడే స్థాయికి తీసుకెళతామన్నారు. తాము పాలకులం కాదు సేవకులమని చెప్పారు. సేవ చేయడానికే ప్రజలు తమకు అవకాశం కల్పించారని తెలిపారు.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×