E-Paper
Advertisement

‘అప్పుడు Zero.. ఇప్పుడు రూ.వేల కోట్లు’.. కేసీఆర్‌, కేటీఆర్‌పై పొంగులేటి నిప్పులు!

‘అప్పుడు Zero.. ఇప్పుడు రూ.వేల కోట్లు’.. కేసీఆర్‌, కేటీఆర్‌పై పొంగులేటి నిప్పులు!
Advertisement

Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ లక్ష్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కేసీఆర్ కుటుంబం సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ఆ తర్వాత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలోనూ కేసీఆర్ కుటుంబం లక్షల కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా కూడబెట్టిందని మంత్రి ధ్వజమెత్తారు.

2004 కరీంనగర్ లోక్ సభ ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్ తనకు ఒక్క ఎకరం భూమి కూడా లేదని స్వయంగా పేర్కొన్నారని మంత్రి గుర్తుచేశారు. అప్పట్లో ఒక్క ఎకరం లేని వ్యక్తికి నేడు రూ.వేల కోట్ల విలువైన భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. పదేండ్ల అధికారంలో ధరణి పోర్టల్‌ను ఆయుధంగా మలచుకుని దళితులు, పేదలు, ప్రభుత్వ అసైన్డ్ భూములను కల్వకుంట్ల కుటుంబం అక్రమంగా దోచుకుందని మండిపడ్డారు.

Advertisement

అటు 2009 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కేటీఆర్‌కు కేవలం ఒక ఎకరం భూమి మాత్రమే ఉండేదని, మరి నేడు ఆయనకు వందల ఎకరాల భూ సామ్రాజ్యం ఎలా ఏర్పడిందో సమాధానం చెప్పాలని పొంగులేటి నిలదీశారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులు, అమరుల కుటుంబాలు నేటికీ అప్పులపాలై ఉంటే.. కల్వకుంట్ల కుటుంబం మాత్రం అమరుల త్యాగాల పునాదులపై వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకుందని ఆరోపించారు.

Advertisement

Also Read: కాంగ్రెస్ భూములు లాక్కుంటే.. బీజేపీ మతం పేరుతో రెచ్చగొడుతోంది.. కవిత ఫైర్

పుట్టుకతోనే తమకు వందల ఎకరాల భూములు ఉన్నాయని కేటీఆర్ చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని మంత్రి అన్నారు. ‘అఫిడవిట్‌లో తప్పులు రాసి నాడు ఎన్నికల కమిషన్‌ను మోసం చేశారా? లేక నేడు ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారా?’ అని మంత్రి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా కల్వకుంట్ల కుటుంబ భూదోపిడీని బట్టబయలు చేశారని, అక్రమ ఆస్తులు కూడబెట్టిన కేటీఆర్ ఇప్పుడు నీతులు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని ఎద్దేవా చేశారు. గత పదేండ్లలో జరిగిన భూ అక్రమాలపై చట్టపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

Also Read: డ్యూటీలో ప్రాణాలు పణంగా పెట్టే స్పై ఏజెంట్లు.. ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్

Tags

Related News

బాంబ్ పేల్చిన విప్ ఆది శ్రీనివాస్.. కేటీఆర్ 7289 డాక్యుమెంట్ సీక్రెట్ ఇదేనా?!

కాంగ్రెస్ భూములు లాక్కుంటే.. బీజేపీ మతం పేరుతో రెచ్చగొడుతోంది.. కవిత ఫైర్

ఏసీబీ వలలో సీఐ, ఎస్ఐ.. సంబురాలు చేసుకున్న స్థానికులు.. ఏం జరిగిందంటే?

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల్లో సర్వే షురూ.. 385 ఎకరాల్లో అసైన్డ్ భూమి ఎంత?

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య.. ఆమె హత్యకు ప్రతీకారం?

దమ్ముంటే సభకు రండి.. సీఎం ప్రశ్నలకు సమాధానం చెప్పండి: అద్దంకి దయాకర్

గూగుల్‌ని అడిగినా చెప్తుంది.. కేసీఆర్‌కు ఆ పేరు ఎందుకొచ్చిందో! – బల్మూర్ వెంకట్

Big Stories

Advertisement
×