E-Paper
Advertisement

డ్యూటీలో ప్రాణాలు పణంగా పెట్టే స్పై ఏజెంట్లు.. ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్

డ్యూటీలో ప్రాణాలు పణంగా పెట్టే స్పై ఏజెంట్లు.. ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్
Advertisement

Action Thriller Series: MI5 లాంటి అత్యంత రహస్య నిఘా సంస్థలో పని చేసిన ఏజెంట్ల వివరాలు ఎంత సీక్రెట్ గా మెయింటైన్ చేస్తారో అందరికీ తెలిసిందే. కానీ ఒక్కసారిగా డేటాబేస్ ఆ డీటైల్స్ అన్నీ మాయమైతే ? ఆ తర్వాత మాజీ ఏజెంట్లను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వరుసగా హత్య చేయడం మొదలుపెడితే ? గతంలో చనిపోయిందని భావించిన ఓ ఏజెంట్ మళ్లీ ప్రత్యక్షమైతే పరిస్థితి ఏంటి… ఇలాంటి ప్రశ్నలతో మరింత ఉత్కంఠ పెంచే స్పై థ్రిల్లర్ ‘స్లో హార్సెస్ సీజన్ 6’ (Slow Horses Season 6). మరి యాక్షన్ అండ్ సస్పెన్స్ ప్రియులు ఈ తరిలేలర్ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం.

కథలోకి వెళ్తే…

మిక్ హెర్రాన్ రాసిన జో కంట్రీ (Joe Country), స్లౌ హౌస్ (Slough House) నవలల ఆధారంగా సాగుతున్న ఈ సిరీస్‌లో మరోసారి స్లౌ హౌస్ టీమ్‌ కి భారీ ముప్పు ఎదురవుతుంది. బ్రిటీష్ నిఘా సంస్థ ఎంఐ5 డేటాబేస్ నుంచి స్లౌ హౌస్‌ లో పని చేసిన పాత ఏజెంట్లు, ప్రస్తుతం ఉన్న ఏజెంట్లకు సంబంధించిన వివరాలు అనుమానాస్పదంగా డిలీట్ అవుతాయి. అది సాధారణ సిస్టమ్ సమస్య కాదని అర్థమయ్యేలోపే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. స్లౌ హౌస్‌ లో పని చేసి బయటకు వెళ్లిన మాజీ ఏజెంట్లను గుర్తుతెలియని హంతకులు ఒక్కొక్కరినీ టార్గెట్ చేయడం మొదలుపెడతారు.

Advertisement

అసలు వారి లిస్ట్ ఎవరి దగ్గర ఉంది ? డేటాబేస్ నుంచి ఆ వివరాలను ఎవరు తొలగించారు ? హత్యలకు, ఆ డిలీషన్‌కు ఏమైనా సంబంధం ఉందా ? అనే ప్రశ్నలు టీమ్‌ను గందరగోళంలో పడేస్తాయి. తన ఏజెంట్లు కూడా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోలేరని గ్రహించిన జాక్సన్ లాంబ్ వెంటనే తన టీమ్‌ ను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తాడు. ఎప్పటిలాగే కఠినంగా కనిపించే లాంబ్‌ ఈసారి తన టీమ్‌ ను ఎలాగైనా కాపాడుకోవాలి అనుకుంటాడు.

ఇదే సమయంలో రివర్ కార్ట్‌రైట్ వ్యక్తిగతంగా కూడా కఠిన పరిస్థితిని ఎదుర్కొంటాడు. తాతయ్య మరణంతో ఒంటరిగా మారిన అతడిపై కూడా హంతకుల దృష్టి పడుతుంది. తన చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఏదో పెద్ద కుట్రలో భాగమని రివర్‌ కు అర్థమవుతుంది. అయితే అసలు షాక్ మాత్రం గతం నుంచి వస్తుంది. మొదటి సీజన్‌ లో చనిపోయిందని భావించిన సిడ్ బాకర్ అనూహ్యంగా తిరిగి రావడంతో కథ మరో మలుపు తీసుకుంటుంది. దీనికి తోడు ఎంఐ5 ఉన్నతాధికారుల కుట్రలు, అంతర్జాతీయ హంతకుల నెట్‌వర్క్, రివర్ తండ్రికి సంబంధించిన పాత రహస్యాలు మళ్లీ బయటకు వస్తాయి.

Advertisement

ముఖ్యంగా గత శత్రువు ఫ్రాంక్ హార్క్‌నెస్ తిరిగి రావడం పరిస్థితిని మరింత కష్టంగా మారుస్తుంది. స్లౌ హౌస్ టీమ్ ఇప్పుడు తమ ప్రాణాలు కాపాడుకుంటూనే ఈ కుట్ర వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించాలి. అసలు డేటాబేస్‌ను ఎందుకు టార్గెట్ చేశారు ? మాజీ ఏజెంట్లను ఎవరు చంపుతున్నారు ? సిడ్ బాకర్ నిజంగా ఎలా తిరిగి వచ్చింది ? హార్క్‌నెస్‌కి ఈ కుట్రతో ఉన్న సంబంధం ఏంటి ? చివరికి జాక్సన్ లాంబ్ టీమ్ ఈ వేట నుంచి బయట పడగలిగిందా ? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సిరీస్‌పై ఒక లుక్కేయాల్సిందే.

సిరీస్ తెలుగులో ఉందా ?

‘స్లో హార్సెస్ సీజన్ 6’ను ఆపిల్ టీవీ ప్లస్ (Apple TV+)లో చూడొచ్చు. ఇందులో గ్యారీ ఓల్డ్‌మన్ (Gary Oldman) జాక్సన్ లాంబ్‌గా, జాక్ లోడెన్ (Jack Lowden) రివర్ కార్ట్‌రైట్‌గా, క్రిస్టిన్ స్కాట్ థామస్ (Kristin Scott Thomas) డయానా టావెర్నర్‌గా నటించారు. ఓలివియా కుక్ (Olivia Cooke), హ్యూగ్ వీవింగ్ (Hugo Weaving) కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. ఇంగ్లీష్ ఒరిజినల్ ఆడియో, సబ్‌టైటిల్స్‌తో చూడాల్సి ఉంటుంది. స్పై థ్రిల్లర్‌తో పాటు డార్క్ కామెడీ లవర్స్ మస్ట్ వాచ్.

Read Also: చిన్నారికి ఇచ్చిన మాట తప్పే దేవుడు.. శక్తులు కోల్పోయి భూమి మీదకు… తెలుగులో క్రేజీ ఫాంటసీ ధమాకా

Tags

Related News

పల్లెటూర్లో టీనేజర్ల సీక్రెట్ లవ్.. ఇంట్లో తెలిసిపోవడంతో ఊహించని ట్విస్ట్.. తెలుగు మూవీనే

ఈజిప్ట్ ఎడారిలో విగతజీవిగా చిన్నారి.. మమ్మీగా ఇంట్లోకి ఎంట్రీ.. దాన్ని ముట్టుకుంటే పోతారు!

లాంగ్ డిస్టెన్స్ లవ్ స్టోరీ.. ప్రేమికులు మిస్ అవ్వకుండా చూడాల్సిన రొమాంటిక్ డ్రామా

పచ్చని సంసారంలో నిప్పులు పోసే కేర్‌టేకర్.. డార్క్ సీక్రెట్స్ తో దడ పుట్టించే థ్రిల్లర్

గ్యాంగ్‌స్టర్లకు చుక్కలు చూపించే అండర్‌కవర్ టీమ్.. హై-వోల్టేజ్ యాక్షన్-కామెడీ డ్రామా సిరీస్

కన్న తల్లిదండ్రులని చంపేసే లేడీ సైకో.. ఒళ్ళు గగుర్పొడిచే రియల్ స్టోరీ తెలుగులో!

మిత్రుడి మరణం.. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌ ఎంట్రీతో మతిపోగొట్టే ట్విస్ట్

Big Stories

Advertisement
×