E-Paper
Advertisement

కాంగ్రెస్ భూములు లాక్కుంటే.. బీజేపీ మతం పేరుతో రెచ్చగొడుతోంది.. కవిత ఫైర్

కాంగ్రెస్ భూములు లాక్కుంటే.. బీజేపీ మతం పేరుతో రెచ్చగొడుతోంది.. కవిత ఫైర్
Advertisement

Kalvakuntla Kavitha: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుల స్ఫూర్తితో రాష్ట్రంలో అరాచక శక్తులను గద్దె దించుతామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా గురువారం బంజారాహిల్స్ లోని రక్షణసేన పార్టీ కార్యాలయంలో ఆమె జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. సెప్టెంబర్ 17 తెలంగాణ పౌరుషానికి, పోరాట పటిమకు, అమరుల త్యాగాల చరిత్రకు నిదర్శనమన్నారు. ఆనాటి జాగీర్దార్లు, జమీందార్ల దాష్టీకాలకు వ్యతిరేకంగా ఈ గడ్డపై జరిగిన వీరోచిత పోరాటానికి విలీన దినోత్సవం గుర్తు అన్నారు.

ఆనాటి పోరాటాన్ని కాంగ్రెస్, బీజేపీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుగా ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై జరుగుతున్న దాష్టీకాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలే ఎదురొడ్డి పోరాటం చేశారే తప్ప ఈ కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదన్నారు. నిజాం పాలన నుంచి విముక్తి కోసం సాగించిన సాయుధ రైతాంగ పోరాటాన్ని కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. సాయుధ రైతాంగ పోరాటంలో ఆ రెండు పార్టీల పాత్ర ఏమీ లేదని చెప్పారు.

Advertisement

సంస్థానాల్లో రాజులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయదని గాంధీ చెప్పారని గుర్తు చేశారు. ఈ పోరాటం జరిగిన సమయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆనవాళ్లే లేవన్నారు. అయినా సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం అంటూ ప్రజలను బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. వాళ్లు చేసే తప్పుడు ప్రచారాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటంలో పాల్గొకపోగా.. భారత్ లో తెలంగాణను విలీనం చేసిన తర్వాత అంతకుముందు పేదలకు పంచిన పది లక్షల ఎకరాలను మళ్లీ జమీందార్లకు కట్టబెట్టిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు భూములు ఇవ్వడం కాదు పేదల నుంచి భూములు లాక్కుందని ఆ పార్టీ నిజ స్వరూపాన్ని తేటతెల్లం చేశారు.

జమీందార్లు, జాగీర్దార్లు ప్రజలపై సాగిస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు పోరాడారని కవిత గుర్తు చేశారు. ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపేందుకు దశాబ్దాల పాటు ఎంతో మంది మేధావులు కృషి చేశారని చెప్పారు. వట్టికోట ఆళ్వార్ స్వామి, సురవరం ప్రతాప రెడ్డి, రావి నారాయణ రెడ్డి వంటి మేధావులు ఉరూరా తిరిగి ప్రజలకు చదువు చెప్పారని, ఆంధ్ర మహాసభ ద్వారా ప్రజలను సంఘటితం చేశారని తెలిపారు. అదే సమయంలో కాళోజీ, దాశరథిల కలాల గర్జనలు, షోయాబుల్లాఖాన్, మగ్దూం మొయినోద్దీన్ వంటి మహనీయుల కృషి కారణంగా ప్రజల్లో చైతన్య స్ఫూర్తి రగిలిందన్నారు.

Advertisement

Also Read: రైల్వే తత్కాల్ టికెట్ల స్కామ్.. పోలీసులకి కంటిమీద కునుకు లేకుండా చేసే మాఫియా

ఆ చైతన్యం నుంచే దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగీ వంటి వీరులు పుట్టుకొచ్చారని కవిత తెలిపారు. మల్లు స్వరాజ్యం, అరుట్ల కమలాదేవి లాంటి మహనీయుల కృషి ఫలితంగా ప్రజలే తుపాకీ పట్టి దండు కట్టి వాళ్లను వాళ్లే రక్షించుకున్నారని అన్నారు. ఈనాటి అరాచక శక్తులను గద్దె దించేందుకు ఆనాటి పోరాట యోధుల స్ఫూర్తి నేటి తెలంగాణకు ఎంతో అవసరమని అన్నారు. ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని నింపి వారి హక్కుల కోసం పోరాటం చేసేందుకు తెలంగాణ రక్షణ సేన పుట్టిందని చెప్పారు. తమ పోరాటంలో మతం, కులం, పేద, ధనిక అని కాకుండా ప్రజల అందరి హక్కుల రక్షణకే ప్రాధాన్యత ఇస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు తమను తాము ఎలా కాపాడుకోవాలో తెలుసని చెప్పారు.

Also Read: వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌కు ఒకే సబ్‌స్క్రిప్షన్.. Meta One వచ్చేసింది!

Tags

Related News

బాంబ్ పేల్చిన విప్ ఆది శ్రీనివాస్.. కేటీఆర్ 7289 డాక్యుమెంట్ సీక్రెట్ ఇదేనా?!

‘అప్పుడు Zero.. ఇప్పుడు రూ.వేల కోట్లు’.. కేసీఆర్‌, కేటీఆర్‌పై పొంగులేటి నిప్పులు!

ఏసీబీ వలలో సీఐ, ఎస్ఐ.. సంబురాలు చేసుకున్న స్థానికులు.. ఏం జరిగిందంటే?

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల్లో సర్వే షురూ.. 385 ఎకరాల్లో అసైన్డ్ భూమి ఎంత?

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య.. ఆమె హత్యకు ప్రతీకారం?

దమ్ముంటే సభకు రండి.. సీఎం ప్రశ్నలకు సమాధానం చెప్పండి: అద్దంకి దయాకర్

గూగుల్‌ని అడిగినా చెప్తుంది.. కేసీఆర్‌కు ఆ పేరు ఎందుకొచ్చిందో! – బల్మూర్ వెంకట్

Big Stories

Advertisement
×