Ponnam Prabhakar : పొన్నం ప్రభాకర్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. గతంలో 2009లో కరీంనగర్ నుంచి ఎంపీగానూ గెలిచారు. కాంగ్రెస్ విద్యార్థి నేతగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పొన్నం ప్రభాకర్ అంచెలంచెలుగా ఎదిగారు. దాదాపు 10 ఏళ్లు ప్రజాప్రతినిధిగాలేరు. తాజా ఎన్నికల్లో ఎమ్యెల్యేగా గెలిచారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు.
పొన్నం ప్రభాకర్ ప్రొఫైల్..
1987-88లో కరీంనగర్ SRR కాలేజ్ యూనియన్ అధ్యక్షుడు
1992-98 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా NSUI అధ్యక్షుడు
1999-2002 వరకు ఉమ్మడి ఏపీ రాష్ట్ర NSUI అధ్యక్షుడు
2002-03లో ఏపీ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
2009లో మార్క్ ఫెడ్ ఛైర్మన్, డీసీఎం అధ్యక్షుడు
2009 ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా విజయం
2018లో TPCC వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం
2023 ఎన్నికల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలుపు