E-Paper
Advertisement

Postal Ballots In Telangana : తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్లు.. రికార్డ్ బ్రేక్!

Postal Ballots In Telangana : తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్లు.. రికార్డ్ బ్రేక్!

Postal Ballots In Telangana : తెలంగాణ ఎన్నికల్లో ఈసారి రికార్డ్ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. అంతేకాదు సమయానికి ఉద్యోగులకి పోస్టల్ బ్యాలెట్లు అందకపోవడంతో అందరూ ధర్నాలు చేయడం, నిరసనలకు దిగడం, ఆఖరికి కోర్టుకి కూడా వెళ్లేసరికి ఉన్నతాధికారులందరూ దెబ్బకి దారిలోకి వచ్చారు. అప్పటికప్పుడు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 2 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యి రికార్డ్ బ్రేక్ చేశాయి.

1, 99,200 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైనట్టు అధికారికంగా ధ్రవీకరించారు. వీటిని ఎక్కువగా ఉద్యోగ వర్గాలు ఉపయోగిస్తుంటాయి. పోలింగ్ డే నాడు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సరళిని చూస్తే, కేసీఆర్ కి వ్యతిరేకంగా, కాంగ్రెస్ కి అనుకూలంగా పడటం విశేషం.

పోస్టల్ బ్యాలెట్లలో ఆధిక్యం లభించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో సీఎం రేవంత్ రెడ్డి( కొడంగల్),  తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (పాలేరు), భట్టి విక్రమార్క ( మధిర) రేవూరి ప్రకాశ్ రెడ్డి (పరకాల), నాగరాజు (వర్థన్నపేట), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్గొండ), వినోద్ (బెల్లంపల్లి) , ప్రేమసాగర్ (మంచిర్యాల) తదితరులు ఉన్నారు.

ఉద్యోగులకు సంబంధించి రావల్సిన బకాయిలు ఆలస్యంగా ఇవ్వడం, జీతాలు ఆలస్యంగా ఇవ్వడం, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చి, ఉద్యోగులు ఎలా పోయినా పర్వాలేదని పట్టించుకోకపోవడంతో కేసీఆర్ సర్కార్ పై కాక ఎక్కిపోయి ఉన్న వారు వ్యతిరేక ఓటు వేశారని అంటున్నారు.

 ఖమ్మంలో అత్యధికంగా 5,500 ఓట్లు, కరీంనగర్ లో 5,307 పోస్టల్ బ్యాటెల్ ఓట్లు నమోదయ్యాయి. మరోవైపు హోం ఓటింగ్ ద్వారా 27,718 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

గత ఎన్నికల్లో చూస్తే కేవలం ఒక లక్ష ఓట్లు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా నమోదైతే, ఈసారి డబుల్ కావడం విశేషం. కావాలని ఉద్యోగులు కోర్టుకి కూడా వెళ్లి తమ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు.ఇంకా చాలా మందికి పోస్టల్ బ్యాలెట్లు అందలేదు.. అవి కూడా అందితే ఇంకా ఎక్కువ సంఖ్యలో పోలయ్యేవి. అదే భావన ఒక్క ఉద్యోగులే కాదు, అన్ని వర్గాలపై పడటంతో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×