BigTV English

T20 World Cup 2024 : కొహ్లీని తప్పిస్తారా?.. దయచేసి అంత పని చేయొద్దు ..

T20 World Cup 2024 : కొహ్లీని తప్పిస్తారా?.. దయచేసి అంత పని చేయొద్దు ..
latest cricket news india

T20 World Cup 2024(Latest cricket news India):

2024లో జూన్ లో జరగనున్న టీ 20 ప్రపంచకప్ కు విరాట్ కొహ్లీని పక్కన పెట్టేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారని కొన్ని ఆంగ్ల పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. దీనిపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. అది కూడా ఎవరికోసమో కాదు.. ఎడమచేతి బ్యాటర్ ఇషాన్ కిషన్ కోసమని అంటున్నారు.


ఇషాన్ ని ఓపెనర్ గా కాకుండా కొహ్లీ ప్లేస్ లో పంపిస్తే, బాగా ఆడతాడని భావిస్తున్నారని ఆ కథనాల సారాంశం. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్ తదితరులు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఈ విషయంపై వారే కొహ్లీతో చర్చించే అవకాశాలున్నాయని అంటున్నారు.

నిజానికి కొహ్లీ క్రీజులోకి రాగానే ఎటాకింగ్ మొదలుపెట్టాడు. కొంత సమయం తీసుకుంటాడు. అదే ఇషాన్ అయితే రావడం, రావడమే తాడో పేడో అన్నట్టు  ఆడతాడు .. ఓపెనర్ గా ఫెయిల్ అవుతున్నాడు. అందుకని మిడిలార్డర్ లో సరిపోతాడని డిసైడ్ చేస్తున్నారు.


ఇదెంతవరకు నిజమో తెలీదు కానీ, కొహ్లీకి టీ 20 మ్యాచ్ ల్లో అద్భుతమైన రికార్డ్ ఉంది. ఇప్పటివరకు 91 టీ 20 మ్యాచ్ లు ఆడిన కొహ్లీ 3,216 పరుగులు చేశాడు. 1 సెంచరీ, 29 అర్థ సెంచరీలు ఉన్నాయి. 52.04 సగటుతో ఉన్నాడు.
టీ 20లో ఎప్పుడెలా ఉంటుందో తెలీదు. రెండు వికెట్లు వెంటనే పడితే కొహ్లీ లాంటి సీనియర్ జట్టులో ఉండటం ఎంతో మంచిదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

కొహ్లీలాంటి సీనియర్ ఉండటం వల్ల కుర్రాళ్లకి మార్గదర్శకంగా ఉంటాడు, తనతో పాటు ఆడటం వల్ల వారికెంతో ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ ఆడిన అసాధారణ ఇన్నింగ్స్ చూస్తేనే అతని అవసరం ఏంటో తెలుస్తుందని కామెంట్ చేస్తున్నారు. అలాంటి మ్యాచ్ లు మరిచిపోగలమా? అంటున్నారు. ఒంటిచేత్తో జట్టుకి విజయాన్ని అందించాడని, అలాంటివెన్నో చిరస్మరణీయమైన విజయాలు తన వద్ద నుంచి ఉన్నాయని చెబుతున్నారు.

ఫామ్ లో లేడా? అంటే అదీ కాదు .. వన్డే వరల్డ్ కప్ లో అద్భుతంగా ఆడి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా అందుకున్నాడని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనలే కరెక్టు కాదు, రెండోది ఇవి కొహ్లీకి తెలిస్తే, అతను మనస్థాపం చెందుతాడు. తర్వాత తన కెరీర్ పై దృష్టి సారించలేడని కొందరు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తను ముందే తెలుసుకునే టీ 20 మ్యాచ్ లు ఆడటం లేదు కదా…కుర్రాళ్లకి దారిస్తున్నాడు కదా…అలాంటప్పుడు ఇలాంటి మెగా టోర్నమెంటులో నిలకడలేని ఇషాన్ కోసం, సీనియర్ కొహ్లీని పక్కన పెట్టడం అంతకన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Sara Tendulkar :  టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న సచిన్ కూతురు సారా ?

Sri Lanka : అప్పుడు తండ్రులు దుమ్ము లేపారు… ఇప్పుడు కొడుకులు రంగంలోకి దిగారు.. శ్రీలంక జట్టుకు ఇక తిరుగులేదు

Smaran Ravichandran : SRH జట్టులో మరో మరో ఆణిముత్యం.. కావ్య పాపకు లక్ కలిసి వచ్చింది.. ఆ ప్లేయర్ ఎవరంటే

Varun-Shruti : టీమిండియా క్రికెటర్ కు దగ్గర అవుతున్న టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్?

Dream11: టీమిండియాకు షాక్..తప్పుకున్న డ్రీమ్ 11.. కొత్త స్పాన్సర్ ఎవరంటే ?

Aus Vs SA : ఆస్ట్రేలియా విధ్వంసం.. 50 ఓవర్లలో 431 పరుగులు.. హెడ్ తో పాటు మొత్తం ముగ్గురు సెంచరీలు

Big Stories

×