E-Paper
Advertisement

Property Tax: ట్యాక్స్ కలెక్షన్ కు స్పెషల్ డ్రైవ్.. ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేశారంటే?

Property Tax: ట్యాక్స్ కలెక్షన్ కు స్పెషల్ డ్రైవ్..  ఇప్పటి వరకు ఎన్ని కోట్లు  వసూలు చేశారంటే?

Property Tax: స్వేచ్ఛ బ్యూరో: క్యూర్ సిటీ ప్రజల అవసరాలకు తగిన విధంగా అభివృద్దితో పాటు పౌర, అత్యవసర సేవలను అందించే మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కు మూడు కార్పొరేషన్లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఈ నెల 15వ తేదీ నుంచే ట్యాక్స్ కలెక్షన్ పై ఉచ్చు భిగిస్తూ ఇప్పటికే రెడ్ నోటీసులు జారీ చేసిన ఆస్తులను సీజింగ్ చేయాలని అధికారులు నిర్ణయించినా, ఉగాది, రంజాన్ పండుగలు రావటంతో అధికారులు కాస్త బ్రేక్ వేశారు. శనివారం రంజాన్ పండుగ ముగిసిన తర్వాత సోమవారం నుంచి మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో ట్యాక్స్ కలెక్షన్ ను వన్ పాయింట్ ప్రొగ్రామ్ గా చేపట్టేందుకు అధికారులు సిద్దమయ్యారు.

ట్యాక్స్ కలెక్షన్ కోసం స్పెషల్ డ్రైవ్

మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ లో గురువారం కమిషనర్ ట్యాక్స్ కలెక్షన్ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారికంగా ప్రకటించగా, మిగిలిన జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో స్పెషల్ డ్రైవ్ ను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. స్కీమ్ అమల్లోకి వచ్చిన తర్వాత మొండి బకాయిదారులకు ఈ స్కీమ్ పై అవగాహన కల్పించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టడంలో విఫలమైందనే చెప్పవచ్చు. మూడు కార్పొరేషన్లలో కలిపి ఇప్పటి వరకు సుమారు రూ. 2200 కోట్ల వరకు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కాగా, ముందే ఫిక్స్ చేసుకున్న రూ. 3 వేల కోట్ల టార్గెట్ చేరేందుకు ఈ నెలాఖరు వరకు మిగిలి ఉన్న 11 రోజుల గడువులో ఇంకా రూ. 800 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. ఇందుకు మూడు కార్పొరేషన్లలోని ట్యాక్స్ స్టాఫ్ కు అధికారులు డైలీ టార్గెట్లను ఫిక్స్ చేసినట్లు, దీంతో బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు కలెక్షన్ కోసం సోమవారం నుంచి ఉరుకులు, పరుగులు పెట్టనున్నట్లు తెలిసింది.

Also Read: Star Heroine: అత్యంత విసుగుపుట్టించే సినిమా… ధురంధర్ 2 చూసి డబ్బులు వృధా చేసుకోవద్దండి… హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు..!

ఓటీఎస్ పై స్టాఫ్ నిర్లక్ష్యం

కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో పేరుకుపోయిన ప్రాపర్టీ ట్యాక్స్ మొండి బకాయిల వసూళ్ల కోసం సర్కారు గత డిసెంబర్ మాసంలోనే వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) ను తీసుకువచ్చింది. మొండి బకాయిదారులు పన్ను చెల్లించేందుకు ముందుకు వచ్చేలా బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో 90 శాతం రాయితీని సర్కారు ప్రక్రటించింది. డిసెంబర్ మాసంలో స్కీమ్ వచ్చిన కొత్తలో జీహెచ్ఎంసీ అధికారులంతా పట్టణ స్థానిక సంస్థల విలీనం, ఆ తర్వాత మూడు కార్పొరేషన్ల పునర్విభజనలో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత గత నెల 11వ తేదీన మూడు కార్పొరేషన్లు ఏర్పాటు కావటానికి ముందే ఓటీఎస్ పై బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు మొండి బకాయిదారుల వద్దకు నేరుగా వెళ్లి, వారు ఆకర్షితులయ్యేలా 90 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్న విషయాన్ని వారికి వివరించి, ట్యాక్స్ వసూలు చేయాలని అధికారులు ఆదేశించారు. కానీ ఈ దిశగా ఒకరిద్దరు బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు మినహా మిగిలిన వారు ఈ దిశగా ప్రయత్నాలేమీ చేయలేదని తెల్సింది. ఫలితంగా ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే మొత్తం 11 లక్షల 45 వేల ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్లు (పీటీఐఎన్) ఉన్నాయి. వీటిలో సుమారు 8.82 లక్షల మేరకు రెసిడెన్షియల్, మరో 2.63 నాన్ రెసిడెన్షియల్ ఆస్తులున్నాయి. ఓటీఎస్ స్కీమ్ ను ఆశించిన స్థాయిలో అమలు చేయలేకపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటీఎస్ కింద చెల్లించిన ఆస్తుల సంఖ్య సుమారు లక్షా 11 వేల మాత్రమే ఉండటం ట్యాక్స్ స్టాప్ నిర్లక్ష్యానికి నిదర్శనం.

Also Read: GHMC: మూడు కార్పొరేషన్లకు కొత్త బ్యాంక్ ఖాతాలు.. ప్రాపర్టీ ట్యాక్స్, లైసెన్స్ ఫీజులపై కొత్త విధానం

Related News

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

Big Stories

×