E-Paper
Advertisement

Puvvada Ajay: సీఎం నన్ను కించపరుస్తున్నారంటూ.. . పువ్వాడ అజయ్ కుమార్ ఎమోషనల్..!

Puvvada Ajay: సీఎం నన్ను కించపరుస్తున్నారంటూ.. . పువ్వాడ అజయ్ కుమార్ ఎమోషనల్..!
Advertisement

Puvvada Ajay: స్వేచ్చ బ్యూరో: ఒంటి కన్నుతో తాను ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేశానని, ఆరు కండ్లున్న ముగ్గురు మంత్రులు జిల్లా కు ఏం చేశారని ఖమ్మం లో శనివారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రశ్నించారు. చింతకాని మండలం జగన్నాధపురంలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి తనను ఒంటికన్ను శివరాసన్ గా బాడీ షేమింగ్ చేయడం పై అజయ్ శనివారం స్పందించారు. హమీలను నెరవేర్చేందుకు మీకు ఏ అంగ వైకల్యం అడ్డు వచ్చిందని ప్రశ్నించారు.

ముగ్గురు మంత్రులు..

ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, తనకు గల ఒక్క కన్నుతోనే ఎంత గొప్పగా పని చేశానో, ఎంత అభివృద్ధి చేశానో జిల్లా ప్రజలకు తెలుసని, మంత్రిగా తాను ఒక్క కంటితో చేసిన పని ఇప్పుడు ఉన్న ముగ్గురు మంత్రులు ఆరు కళ్లతో ఏందుకు చేయలేకపో తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వ హననమే ఎజెండాగా సీఎం రేవంత్ జగన్నాథపురం సభలో మాట్లాడారని అజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ రోడ్డు ప్రమాదంలో జరిగిన దుర్ఘటన ఘటనలో తాను ఓ కన్ను కోల్పోయినట్లు చెప్పారు.

Advertisement

Also Read: Nerella Incident: నేరెళ్ల థర్డ్ డిగ్రీ బాధితుడు.. గంధం గోపాల్ కన్నుమూత!

సీతారామ ప్రాజెక్టు కోసం..

గతంలోనూ సీఎం రేవంత్ ఇలాగే కించపరిచారని, తన మీద సీఎం, మంత్రులకు ఉన్న కక్షను ఈవిధంగా తీర్చుకుంటారని, విషయ పరిజ్ఞానం లేక ముఖ్యమంత్రి స్థాయిని మరిచి కన్ను లేదని, పన్ను లేదని దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. సీతారామ ప్రాజెక్టు కోసం కృషి చేశానని, వ్యక్తిగత విమర్శలతో తాత్కాలికంగా సంతృప్తి పడతారే తప్ప ఎల్లకాలం ఉండదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయక డొంకతిరుగుడు మాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని, దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారన్నారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also read: Krishna Basin: తెలంగాణ రైతులకు బిగ్ అప్‌డేట్.. రెండు తెలుగు రాష్ట్రాలకు నీళ్లు వచ్చేది అప్పుడే..?

Related News

తెలంగాణ పోక్సో కేసులకు క్యాపిటల్‌గా మారింది.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన!

చిప్‌ల తయారీలో సరికొత్త చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. అసలేంటి ఈ టెక్నాలజీ?

KTR Challenge: కాంగ్రెస్ సర్వేలోనే బీఆర్ఎస్‌కు 78 సీట్లు.. దమ్ముంటే ఎన్నికలకు రండి: కేటీఆర్ సవాల్!

ఖమ్మంలో దారుణం.. మనిషి బ్రతికుండగానే చనిపోయాడంటూ అప్పగించిన ప్రైవేట్ ఆసుపత్రి!

Krishna Basin: తెలంగాణ రైతులకు బిగ్ అప్‌డేట్.. రెండు తెలుగు రాష్ట్రాలకు నీళ్లు వచ్చేది అప్పుడే..?

Kaleshwaram: బీజేపీ ఎంపీకి బీఆర్ఎస్ లీడర్ స్క్రిప్టా.. షాకింగ్ రిపోర్టును బయటపెట్టిన సీఎం రేవంత్!

షాబాద్ ఆరుగురి హత్య కేసులో సంచలన మలుపు.. నిందితుడిపై రూ. 2 లక్షల రివార్డు.. ఎస్సై సస్పెన్షన్!

Big Stories

Advertisement
×