E-Paper
Advertisement

KTR Challenge: కాంగ్రెస్ సర్వేలోనే బీఆర్ఎస్‌కు 78 సీట్లు.. దమ్ముంటే ఎన్నికలకు రండి: కేటీఆర్ సవాల్!

KTR Challenge: కాంగ్రెస్ సర్వేలోనే బీఆర్ఎస్‌కు 78 సీట్లు.. దమ్ముంటే ఎన్నికలకు రండి: కేటీఆర్ సవాల్!
Advertisement

KTR Challenge: స్వేచ్చ బ్యూరో: ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కు 117 కాదు కదా.. 7 కూడా రావు అని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది కలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత సర్వేలోనే 78 సీట్లు బీఆర్ఎస్ కు వస్తాయని చెప్పింది ముమ్మాటికి వాస్తవమన్నారు. ముఖ్యమంత్రి తాను సర్వే చేయించుకోలేదన్న విషయం నిజమైతే.. ఆ మేరకు దేవుడిపైన ఒట్టు వేసి చెప్పాలని డిమాండ్ చేశారు. తన పాలనపై అంత నమ్మకం ఉంటే రేవంత్ రెడ్డి.. స్థానిక సంస్థల ఎన్నికలు లేదా పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు.. లేదంటే అసెంబ్లీని రద్దు చేసి తిరిగి ఉప ఎన్నికలకు ఎన్నికలకు పోయే పోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి నీళ్లు ఎత్తిపోయడం తెలవదు అన్నారు. మొలవది అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమించి, సబ్బండ వర్గాలను ఏకం చేసి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు. కేసీఆర్ గురించి కాంగ్రెస్ నేతలకు మాట్లాడే స్థాయి లేదన్నారు.

వచ్చేది మేమే..

నిజంగానే బీఆర్ఎస్ పార్టీని ఆపగలిగే శక్తి ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసుకున్న సొంత సర్వేలో 78 సీట్లు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మరోసారి పేర్కొన్నారు. దీంతోపాటు మరో మూడు, నాలుగు సర్వేల్లో కూడా బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని తేలిందన్నారు. లక్షల క్యూసెక్కుల నీరు కిందికి పారుతుంటే తెలంగాణని కరువు కాటకాల ముందు నిలబెట్టే కుట్ర ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. కాలేశ్వరంలో మేడిగడ్డతో సంబంధం లేకుండా మొత్తం గోదావరి పరివాహక ప్రాంతం రైతన్నలకు ప్రజలకు నీళ్లు అందించే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ మూర్ఖత్వంతో తెలివితక్కువతనంతో గత ప్రభుత్వం పైన ద్వేషంతో పంటలను ప్రజలను ఎండబెడుతున్నారని ఆరోపించారు.

కరువును ఆపాలని డిమాండ్..

Advertisement

కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని అక్కడ పారుతున్న నదిని ప్రజలకు చూపించడంతోనే తన బండారం బయటపడడంతో ప్రభుత్వానికి పిచ్చి లేసిందని దీంతో అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. ఒకవైపు ప్రజలు రిటైర్డ్ ఇంజనీర్లు, పార్టీలు నీటిని ఎత్తిపోసి రానున్న కరువును ఆపాలని డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం మాత్రం తెలంగాణ నీళ్లను ఏపీకి వదిలిపెడుతున్నారని విమర్శించారు. భద్రాద్రి రాముడు తో భద్రాచలంతో ఎలాంటి కాలేశ్వరం నీటిని వరద పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఇస్తున్నారన్నారని మండిపడ్డారు.

Also read: Nerella Incident: నేరెళ్ల థర్డ్ డిగ్రీ బాధితుడు.. గంధం గోపాల్ కన్నుమూత!

రానున్న 100 రోజుల పాటు..

Advertisement

గోదావరి బేసిన్ లో ఉన్న రిజర్వాయర్ల స్టోరేజీ కూడా సగానికి పైగా ఖాళీగా ఉందని, మరోవైపు కన్నెపల్లి దగ్గర లక్షల క్యూసెక్కుల నీరు కిందికి పారుతుందన్నారు. రానున్న అక్టోబర్ వరకు కూడా ఈ లక్షల క్యూసెక్కుల నీరు కిందికి వృధాగా పోయే ప్రమాదం ఉన్నదన్నారు. కాంగ్రెస్ కు నిజంగానే రైతుల పట్ల, తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ నీటిని రానున్న 100 రోజుల పాటు కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ ప్రారంభించి ఎత్తిపోస్తే గోదావరి బేసిన్ మొత్తం సస్యశ్యామలం అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మా పైన కోపం ఉండవచ్చు లేదా ద్వేషం ఉండవచ్చు.. కానీ తెలంగాణ ప్రజల పైన, రైతన్నల పైన అక్కసు పెట్టుకోకుండా కిందికి పారుతున్న నీటిని ఎత్తిపోస్తే అందరికీ మంచి జరుగుతుందన్నారు. ప్రభుత్వం మాత్రం మేడిగడ్డ బ్యారేజీ పేరు చెప్పి అది కూలిపోతుందని ప్రజలను మభ్యపెడుతూ, ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేస్తూ కిందికి నీళ్లను పంపిస్తుంటే.. పక్క రాష్ట్రం వాళ్ళు మాత్రం పట్టిసీమ పంప్ హౌస్ ద్వారా, పంపుల ద్వారా భారీగా నీటిని తోడుకుంటున్నారు.

కన్నెపల్లి నదీ ప్రవాహం..

మేడిగడ్డతో ఎలాంటి సంబంధం లేకుండానే, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఒక్క గేటు కూడా మూయకుండానే, కన్నెపల్లి నదీ ప్రవాహం దగ్గర 93 మీటర్ల ప్రవాహం నమోదైన ప్రతిసారి భారీగా నీళ్లను ఎత్తిపోసుకోవచ్చు. ప్రతిరోజు ఒక హుస్సేన్ సాగర్ లో ఉన్న స్థాయిలో ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉన్నదన్నారు.కానీ ఈరోజు దాదాపు 97 మీటర్ల నదీ ప్రవాహం కన్నెపల్లి దగ్గర పారుతున్నదని, దీన్ని కేవలం ఒక్క బటన్ ద్వారా పంపులు ప్రారంభించి నీటిని ఎత్తిపోస్తే తెలంగాణ కరువు నుంచి దూరం అవుతుందన్నారు.

తాగునీటి సంక్షోభం..

రానున్న 100 రోజుల పాటు కనీసం 200 టీఎంసీల నీటిని గోదావరి బేసిన్‌లో ఉన్న రిజర్వాయర్లు, ప్రాజెక్టులకు నింపవచ్చు.. మిడ్ మానేరు, లోయర్ మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అనంతగిరి, మల్కపేట, బస్వపూర్ రిజర్వాయర్లు అన్నీ నిండుతాయన్నారు. దీంతో సగం తెలంగాణకి వ్యవసాయ సంక్షోభం, తాగునీటి సంక్షోభం రాకుండా చూసుకోవచ్చు అన్నారు. తెలంగాణ ముంగిట నిలబడ్డది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మేడిగడ్డకు సంబంధమే లేని, ఎక్కడో సుదూరాన ఉన్న భద్రాచలం రాముడితో పాటు 44 ఊర్లు నిండిపోతాయని, మునిగిపోతాయని అబద్ధాలు చెప్తున్నారన్నారు.

Also read: TGSPDCL: ఈ దారుణాలకు బాధ్యులెవరు.. వణుకు పుట్టిస్తున్న విద్యుత్ శాఖ రిపోర్ట్..!

రైతు వ్యతిరేకి కాంగ్రెస్..

కన్నెపల్లి దగ్గర నీళ్లు లేకుంటే, మరి కిందికి పోతున్న ఆ నీటితోనే పక్క రాష్ట్రంలోని పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎలా పనిచేస్తుంది? వందల టీఎంసీలను ఎలా ఎత్తిపోస్తుందో ప్రభుత్వం చెప్పాలఅని డిమాండ్ చేశారు. భద్రాచలానికి ప్రమాదం ఉందంటే అది ముమ్మాటికి పక్క రాష్ట్రం కడుతున్న పోలవరంతోనే కానీ, కాళేశ్వరంతో కాదు అన్నారు. కాళేశ్వరం మాత్రమే కాకుండా దేవాదుల పంపులు కూడా ప్రారంభించ కుండా వరంగల్ జిల్లా రైతుల నోట్లో మట్టి కొడుతున్న రైతు వ్యతిరేకి కాంగ్రెస్ అన్నారు. కేవలం గత ప్రభుత్వం పైన కోపంతో రాష్ట్ర రైతాంగం యొక్క పంటల్ని ఎండబెట్టే పనిలో ఉన్నారని ఆరోపించారు.ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పంప్ హౌస్‌లు ప్రారంభించి, నీళ్లను ఎత్తిపోయకుంటే రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు తిరగబడతారన్నారు.వర్షాలు పడకున్నా గోదావరిలో నది నీళ్లు కిందికి పారుతున్నా పట్టించుకోకుండా కావాలనే రైతాంగంపై కుట్ర చేస్తున్న కాంగ్రెస్ వైఖరిని ఇంకో రెండు, మూడు వారాలు చూసి పార్టీగా ఒక భారీ కార్యాచరణ ప్రకటిస్తాం అని కేటీఆర్ తెలిపారు.

షాబాద్‌లో జరిగిన 6 హత్యలు..

హరీష్ రావు కేసీఆర్ తయారు చేసిన క్రమశిక్షణ కలిగిన సైనికుడని, పార్టీ ప్రారంభం నుంచి ఆయనకి అండగా నిలబడ్డ నాయకుడన్నారు. ఆయన పైన ఇలాంటి చిల్లర పుకార్లు ఎన్నో సార్లు వచ్చాయని వాటికి ఆయన స్పష్టంగా పలుమార్లు సమాధానం ఇచ్చారన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతను కాపాడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ వైఫల్యం నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదన్నారు. రాష్ట్రంలో మహిళలు, బాలికల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఫిర్యాదు చేయడానికి కూడా బాధిత కుటుంబాలు భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. షాబాద్‌లో జరిగిన ఈ 6 హత్యలు సాధారణ హత్యలు కావు, ఇవి ప్రభుత్వ అసమర్థత వల్ల జరిగిన ప్రభుత్వ హత్యలేనని స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ మంత్రులు రాజయ్య, ప్రశాంత్ రెడ్డి, నాయకులు మధుసూదనాచారి, వెంకటరమణారెడ్డి, రవీందర్ రావు, నాగేశ్వరరావు, వెంకటవీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Also Read: Krishna Basin: తెలంగాణ రైతులకు బిగ్ అప్‌డేట్.. రెండు తెలుగు రాష్ట్రాలకు నీళ్లు వచ్చేది అప్పుడే..?

Related News

తెలంగాణ పోక్సో కేసులకు క్యాపిటల్‌గా మారింది.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన!

చిప్‌ల తయారీలో సరికొత్త చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. అసలేంటి ఈ టెక్నాలజీ?

ఖమ్మంలో దారుణం.. మనిషి బ్రతికుండగానే చనిపోయాడంటూ అప్పగించిన ప్రైవేట్ ఆసుపత్రి!

Puvvada Ajay: సీఎం నన్ను కించపరుస్తున్నారంటూ.. . పువ్వాడ అజయ్ కుమార్ ఎమోషనల్..!

Krishna Basin: తెలంగాణ రైతులకు బిగ్ అప్‌డేట్.. రెండు తెలుగు రాష్ట్రాలకు నీళ్లు వచ్చేది అప్పుడే..?

Kaleshwaram: బీజేపీ ఎంపీకి బీఆర్ఎస్ లీడర్ స్క్రిప్టా.. షాకింగ్ రిపోర్టును బయటపెట్టిన సీఎం రేవంత్!

షాబాద్ ఆరుగురి హత్య కేసులో సంచలన మలుపు.. నిందితుడిపై రూ. 2 లక్షల రివార్డు.. ఎస్సై సస్పెన్షన్!

Big Stories

Advertisement
×