E-Paper
Advertisement

Nerella Incident: నేరెళ్ల థర్డ్ డిగ్రీ బాధితుడు.. గంధం గోపాల్ కన్నుమూత!

Nerella Incident: నేరెళ్ల థర్డ్ డిగ్రీ బాధితుడు.. గంధం గోపాల్ కన్నుమూత!
Advertisement

Nerella Incident: స్వేచ్చ బ్యూరో: సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న థర్డ్ డిగ్రీ ఘటనలో బాధితుడైన గంధం గోపాల్ శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనలో పోలీసుల థర్డ్ డిగ్రీకి గురైన ఎనిమిది మంది బాధితుల్లో గోపాల్ ఒకరు. ఆయన మృతితో నేరెళ్ల ఘటన మరోసారి రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

దాదాపు పదేళ్లు..

ఈ సందర్భంగా మిగిలిన బాధితులు మరోసారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. థర్డ్ డిగ్రీ బాధితులు బానయ్య, కోల హరీష్ మాట్లాడుతూ.. ఘటన జరిగి దాదాపు పదేళ్లు గడిచినా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా తమ జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని, న్యాయం కోసం తాము చేయని పోరాటం లేదన్నారు. తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జీవితాలను ఛిన్నాభిన్నం చేసిన పోలీసు అధికారులపై ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Advertisement

Also Read: TGSPDCL: ఈ దారుణాలకు బాధ్యులెవరు.. వణుకు పుట్టిస్తున్న విద్యుత్ శాఖ రిపోర్ట్..!

గంధం గోపాల్ మృతి..

Advertisement

అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమకు అండగా నిలిచారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. గంధం గోపాల్ మృతితో నేరెళ్ల థర్డ్ డిగ్రీ బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్ మరోసారి బలంగా వినిపిస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

Also Read: Investment Fraud: హైదరాబాద్‌లో మరో విజయ్ మాల్యా లాంటి మోసం.. రూ. 50 కోట్లతో భార్య భర్తలు జంప్..!

Related News

మంత్రి సురేఖపై చర్యలు లేనట్టేనా.. క్లారిటీ ఇచ్చిన పీసీసీ!

ఇందూరు గడ్డపై కల్వకుంట్ల కవిత సమర శంఖం.. 2014 మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా?

నీట్-పీజీ ఏఐక్యూ కలకలం.. 50% నుంచి 15%కి తగ్గించాల్సిందే.. కేంద్రానికి వినోద్ కుమార్ లేఖ!

డబ్బుల కోసం చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటం.. ఏం చేసారంటే?

హాస్పిటల్ క్వార్టర్స్‌లో దారుణం.. 21 ఏళ్ల నర్స్ దారుణ హత్య?

మత్స్యకారులకు బిగ్ షాక్.. సబ్సిడీ వాహనాలపై అదనపు సెస్ భారం!

దేశవ్యాప్తంగా నీట్ పీజీ ఎగ్జామ్.. మద్యం తాగి పరీక్షా కేంద్రానికి వచ్చిన స్టూడెంట్, తెలంగాణలో ఘటన

టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభ.. సొంతగడ్డపై కవిత బల ప్రదర్శనా? తెలంగాణ రాజకీయాల్లో చర్చ

Big Stories

Advertisement
×