E-Paper
Advertisement

తెలంగాణ పోక్సో కేసులకు క్యాపిటల్‌గా మారింది.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన!

తెలంగాణ పోక్సో కేసులకు క్యాపిటల్‌గా మారింది.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన!
Advertisement

RS Praveen: స్వేచ్ఛ బ్యూరో: క్రైం రివ్యూల్లో ఐపీఎస్ అధికారులు ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు. నిందితుడి పూర్వపరాలు, అతడి వివరాలు తెలుసుకొని, కేసులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయని అడగాలి కదా అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో శనివారం మీడియాతో మాట్లాడారు.

పోలీసులకు చేతకాకపోతే ప్రైవేట్ కేసు పెడతా..

Advertisement

తెలంగాణ పోక్సో కేసులకు క్యాపిటల్ గా మారిందని చెప్పడానికి చాలా బాధగా ఉంది, కానీ వాస్తవం అన్నారు. రాత్రి 11 నుంచి 1 గంట వరకు రాజ్ కుమార్ అనే నిందితుడు షాబాద్ దైవాలగూడ లో.. బాధితులను నరికి చంపాడని, ఇప్పటికీ నిందితుడు పరారీలోనే ఉన్నాడన్నారు. ప్రజలు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసులకు చేతకాకపోతే నేను ప్రైవేట్ కేసు పెడుతా అని బాధితురాలి మామ అంటున్నాడంటే… పోలీసుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు..

Advertisement

కేవలం ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లపై చార్జిషీట్ వేయడం మీద తప్ప.. ఇతర అంశాల మీద ప్రభుత్వానికి ధ్యాస లేదన్నారు. ఐపీఎస్ అధికారులు అయినా స్పెషల్ పార్టీలను పెట్టి 6 హత్యలు చేసిన నిందితున్ని ఎందుకు పట్టుకోలేదు అని నిలదీశారు. పోక్సో కేసుల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ కొడుకు విషయంలో కూడా ఇదే జరిగింది.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎందుకు బెయిల్ అడ్డుకోలేదు? అని ప్రశ్నించారు.

ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు..

అమ్మాయిలు మహిళలను కాపాడడానికి ఎందుకు పోలీసు యంత్రాంగాన్ని వాడడం లేదుఅని నిలదీశారు. పోక్సో కేసుల్లో బెయిలబుల్ కేసులు పెట్టడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఎవరికైనా పోక్సో కేసుల్లో బెయిల్ ఇచ్చి ఉంటే డీజీపీ వెంటనే పునః సమీక్షించాలి..వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, బెయిల్ ఇవ్వకుండా కోర్టు ముందు హాజరుపరచాలని కోరారు. మహిళా కమీషన్ ఎక్కడ పోయింది. బాలల హక్కుల కమీషన్ ఎక్కడ? పిల్లలకు ఏం జరుగుతుంది? ఎన్ని నేరాలు జరిగాయి అని వివరాలు అడగాలి కదా… చర్యలు తీసుకోవాలని ఆదేశించాలి కదా ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించారు. సమావేశంలో నేతలు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ,కడారి స్వామి యాదవ్ ,గోపగాని రఘురాం ,పావని గౌడ్ పాల్గొన్నారు.

Also Read: చిప్‌ల తయారీలో సరికొత్త చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. అసలేంటి ఈ టెక్నాలజీ?

Related News

భక్తి ముసుగులో రక్తి క్రీడ.. జూబ్లీహిల్స్‌లో గురూజీల నిజస్వరూపం బట్టబయలు!

హైటెక్స్ వేదికగా ‘సమాఖ్య-2026’ బిజినెస్ మీట్ ప్రారంభించిన సీఎం రేవంత్!

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ!

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×