E-Paper
Advertisement

Rahul Chitchat : స్టూడెంట్స్ తో రాహుల్ చిట్ చాట్.. అన్నీ లీకులే.. పరీక్షల్లేవ్..

Rahul Chitchat : స్టూడెంట్స్ తో రాహుల్ చిట్ చాట్.. అన్నీ లీకులే.. పరీక్షల్లేవ్..
Advertisement
Rahul Chitchat

Rahul Chitchat : హైదరాబాద్‌ అశోక్ నగర్‌ చౌరస్తాలో, రాహుల్ గాంధీ స్టూడెంట్స్ తో చిట్ చాట్ చేశారు. చాయ్ తాగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణలో కలలు నెరవేరలేదని రాహుల్ తెలిపారు. ప్రిపరేషన్ లోనే ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయని స్డూడెంట్స్ రాహుల్ కు మొరపెట్టుకున్నారు. సడెన్‌గా విద్యార్థులను కలిసేందుకు వెళ్లి వారందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

సెక్యూరిటీ గురించి కూడా ఆలోచించకుండా స్టూడెంట్స్ మధ్యకెళ్లి వాళ్లతో ముచ్చటించారు. ఒత్తిడితో కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీకులు తప్ప.. పరీక్షల్లేవని ప్రభుత్వంపై మండిపడ్డారు. అనంతరం స్థానిక బావర్చీ హోటల్‌లో సందడి చేశారు. ఈ విషయాన్ని రాహుల్ X లో నెటిజన్లతో పంచుకున్నారు.

Advertisement

“హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న యువతను నేను కలిశాను. తెలంగాణ వస్తే తమకు కొలువులు వస్తాయని ఆశించామని, రాష్ట్రం వచ్చి పదేళ్లయినా తమ ఆకాంక్షలు నెరవేరలేదని వారు ఆవేదన వ్యక్తం చేయడం నన్ను కలిచివేసింది. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ యువతకు న్యాయం జరగలేదు. నోటిఫికేషన్లు లేక, కోర్టు కేసులతో, పేపరు లీకులతో 30 లక్షల మంది నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారు. వారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనే వారికి కొలువులు రాని దుస్థితి.అందుకే వారి కలలు సాకారం అయ్యేలా.. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన జాబ్ క్యాలెండరును వారికి చూపించి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే, 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం.” పేర్కొన్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×