Raja Singh: తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న కొత్త వ్యవహారాలకు బయటపెట్టారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటరిచ్చారు. మళ్లీ బీజేపీలోకి వెళ్లే అవకాశం లేదన్నారు. తనపై కావాలనే ఫేక్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అసలు బీజేపీలో ఏం జరుగుతోంది?
తెలంగాణ బీజేపీలో జరుగుతున్న వ్యవహారాలను మరోసారి బట్టబయలు చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఫైటర్ కావాలన్నారు. అధ్యక్షుడు రామచందర్‌రావు ఒక మంచి రైటర్ అని, కానీ ఫైటర్ కాదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి ఎవరు కారణం? వెన్ను పోటు ఎవరు పొడిచారు? అన్నది తేలిపోతుందన్నారు.
తాను ఏ రోజూ పదవి ఆశించలేదని, తనను వాళ్లు ప్రపోజ్ చేయరని తనకు ముందే తెలుసన్నారు. నా గతి కార్యకర్తల గతి ఇంతేనన్నారు. ఎంతో బాధతో పార్టీకి రాజీనామా చేశానన్నారు. మళ్లీ బీజేపీలో చేరే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. బాగా ఆలోచించిన తర్వాతే పార్టీకి రాజీనామా చేశానని మనసులోని మాట బయటపెట్టారు.
రాజాసింగ్ మళ్లీ బీజేపీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కొందరు తనపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు ఆవేదన వ్యక్తం చేశారు. గతవారం రాజాసింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. ఆయన పార్టీకి రాజీనామా చేశారని, ఆయన ఎప్పుడైనా వచ్చే అవకాశముందని సూచనప్రాయంగా చెప్పారు.
ALSO READ: ఆదిలాబాద్ డీసీసీ పీఠం ఎవరికి?
ఎవరి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందో ఢిల్లీ పెద్దలకు చెప్పాలని అనుకున్నానని, లక్షల మంది కార్యకర్తల అభిప్రాయాలను నాయకత్వం పక్కన పెట్టిందన్నారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారికి న్యాయం చేస్తున్నారని, దీని గురించి హైకమాండ్‌కు చెప్పాలని అనుకున్నానని తెలిపారు. తన రాజీనామా వెనుక ఎలాంటి ప్లాన్, కుట్ర లేదన్నారు.
అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడేంత పెద్దవాడిని తాను కాదని, ఆయన తనకు ఎప్పుడూ ఫోన్ చేయలేదు, చేయరన్నారు. తాను కేవలం నియోజకవర్గానికి ఎమ్మెల్యేను మాత్రమేనన్నారు. తెలంగాణ బీజేపీలో చాలా తప్పులు జరుగుతున్నాయని, పెద్దలకు లేఖ రాసినా, మెయిల్ పంపించినా ఎలాంటి రెస్పాన్స్ లేదన్నారు.
మాధవీలతపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. బీజేపీలో ఓ మహిళా శక్తి బృందంతో తనపై కామెంట్లు చేయిస్తున్నారని, తిరిగి మీపై విమర్శలు చేసే అంత చిన్నస్థాయి తనకు కాదన్నారు. దమ్ముంటే ఫేస్ టు ఫేస్ చెప్పండి.. అంతేకానీ ప్రచారాలు చేయడం తగదన్నారు. తన వల్ల మీకు ఎలాంటి భయం ఉండదని, కంగారు పడవద్దని సూచన చేశారు.
మొత్తానికి చెప్పాల్సినదంతా చెప్పేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. మరి వచ్చే ఎన్నికల్లో గోషామహల్ నుంచి బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారో చూడాలి. అన్నట్లు మాదవీలత ఇప్పుటి నుంచే ప్లాన్ చేస్తున్నట్లు మరోవైపు బలంగా వార్తలు వస్తున్నాయి.
మళ్లీ బీజేపీలో చేరే ప్రసక్తే లేదు: రాజా సింగ్
బాగా ఆలోచించిన తర్వాతే పార్టీకి రాజీనామా చేశాను
రాజాసింగ్ మళ్లీ బీజేపీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఫేక్ ప్రచారం చేస్తున్నారు
ఎవరి వల్ల పార్టీకి నష్టం జరుగుతోందో ఢిల్లీ పెద్దలకు చెప్పాలని అనుకున్నా
లక్షల మంది కార్యకర్తల… pic.twitter.com/z6YUkfJNjs
— BIG TV Breaking News (@bigtvtelugu) July 27, 2025