BigTV English

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Bandi Sanjay: కరీంనగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఅర్ఎస్ పార్టీలు నీకు నేను రక్ష, నాకు నువ్వే రక్ష అనే స్నేహ సంబంధంలో ఉన్నా, పరిస్థితులు ఇంత వరకు ఎలా వచ్చాయో చూడాలని ఆయన అన్నారు. కేటీఆర్‌కు ఉన్న అతి తెలివి నాకు లేదని, కేటీఅర్ చెల్లె కవిత ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని ఒప్పుకుందని, ఆమె నాకు నోటీసులు పంపితే చట్టపరంగా సమాధానం ఇస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు.


ఫోన్ ట్యాపింగ్ కేసులను తాను స్వయంగా ఎదుర్కొంటానని, చేసిన తప్పులని కప్పిపుచ్చుకునేందుకు బెదిరించడాన్ని తట్టుకోలేనని, నేను బెదిరే వ్యక్తి కాదు. మా నాన్న పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిన్ని కాదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయించలేదని గుడికి వచ్చి ప్రమాణం చేస్తారా? నేను ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని ప్రమాణం చేస్తాను. నా సవాల్‌కు నువ్వు సిద్ధమా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తమ పార్టీని వదిలి బయటకు రావాల్సిందని, కాళేశ్వరం రిపోర్ట్ వచ్చాక కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ అధికారులకు తన దగ్గర ఉన్న ఆధారాలు అందించానని, సిట్ అధికారులు నిజాయితీతో పని చేస్తున్నారు కానీ వారి పరిధి పరిమితమని పేర్కొన్నారు. ప్రభాకర్ రావు ఐజి అని కేంద్రానికి తప్పుడు సమాచారం అందించారని నాకు తెలుస్తుందని ఆయన నొక్కి చెప్పారు.


ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో జనవరి, జులై నెలల్లో మాత్రమే ఆధారాలు వచ్చాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినందున రేవంత్ రెడ్డిని విచారణకు పిలవాలన్నారు. కేటీఆర్ లాగా కొంపలు ముంచే తెలివి నాకు లేదని బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు.

Also Read: Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

అంతేకాదు, సినిమా యాక్టర్లు, రాజకీయ నేతల ఫోన్లు విని బ్లాక్ మెయిల్ చేశారని, బెంగాల్‌కు వెళ్లి మమతా బెనర్జీకి డబ్బులు ఇచ్చిందా? ముంబాయికి వెళ్లి డబ్బులు ఇవ్వలేదా? అని ప్రశ్నించారు.

సిట్ అధికారులపై నమ్మకం ఉన్నప్పటికీ, ప్రభుత్వం పట్ల నమ్మకం లేదని, ఫోన్ ట్యాపింగ్ విచారణ సిబిఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు సుమారు 6000 మంది ఫోన్ ట్యాపింగ్ అయ్యారని, విద్యుత్ కొనుగోలు విషయంపై వచ్చిన నివేదికపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హరీష్ రావు, కవిత ఫోన్ ట్యాపింగ్ కింద ఉన్నందున వారినీ విచారణకు పిలవాలని డిమాండ్ చేశారు.

ఈ వ్యాఖ్యలతో బండి సంజయ్ గట్టి రాజకీయ సంక్షోభానికి పాల్పడగా, రాజకీయ వర్గాలు తీవ్ర స్పందన చూపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, అవినీతిపై సస్పెన్స్ గల వాతావరణం నెలకొన్నది. రాజకీయ వేత్తలు, విశ్లేషకులు తదుపరి పరిణామాలను ఆసక్తితో చూస్తున్నారు.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×