E-Paper
Advertisement

Film industry: ఫ్యామిలీ ఉండగానే ఇంకో మహిళతో ఎఫైర్.. పైగా 6 నెలల ప్రెగ్నెన్సీ..ఈ నటుడు మామూలు ముదురు కాదుగా!

Film industry: ఫ్యామిలీ ఉండగానే ఇంకో మహిళతో ఎఫైర్.. పైగా 6 నెలల ప్రెగ్నెన్సీ..ఈ నటుడు మామూలు ముదురు కాదుగా!
Advertisement

Film industry:ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీ నటులు భార్య, పిల్లలు ఉండగానే ఇంకొకరితో ఎఫైర్ పెట్టుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇక్కడ ఒక నటుడు మాత్రం భార్య, పిల్లలు ఉండి కూడా.. వేరే మహిళతో ఎఫైర్ పెట్టుకోవడమే కాకుండా ఆమెకు ఆరు నెలల ప్రెగ్నెన్సీ.. అంతేకాదు ఇప్పుడు ఆమెను వివాహం కూడా చేసుకున్నారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ నటుడు మామూలు ముదురు కాదు అంటూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఆయన ఎవరో కాదు ప్రముఖ తమిళ నటుడు మదాంపట్టి రంగరాజ్(Madhampatty Rangaraj).

భార్య ఉండగానే మరో మహిళతో ఎఫైర్..

Advertisement

మొదటి భార్య, పిల్లలు ఉండగానే మదాంపట్టి రంగరాజ్ ఇప్పుడు రెండవ వివాహం చేసుకున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ జాయ్ క్రిజిల్డా (Joy Crizildaa) ను జూలై 27న గుడిలో వివాహం చేసుకున్నారు. అయితే రంగరాజు మొదటి భార్య శృతి రంగరాజ్ (Shruti Rangaraj) చేసిన వాదనలతో ఈ ప్రకటన వివాదానికి దారితీసింది. అంతేకాదు ఆదివారం రోజు వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా జాయ్ స్వయంగా పంచుకుంది.

ఆరు నెలల ప్రెగ్నెన్సీ.. రహస్యంగా వివాహం చేసుకున్న నటుడు..
ఇక గుడిలో వివాహం చేసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ “మిస్టర్ అండ్ మిసెస్ రంగరాజ్” అనే క్యాప్షన్ కూడా జోడించింది. అంతేకాదు పెళ్లి ఫోటోలతో పాటు ప్రెగ్నెన్సీ ఫోటోలను కూడా షేర్ చేస్తూ..” బేబీ లోడింగ్ 2025.. నేను గర్భవతిగా ఉన్నాను.. ప్రస్తుతం ఆరవ నెల” అంటూ తెలిపింది. ఇక ఇది చూసిన అభిమానులు కూడా ఇంత హాట్ బాంబు పేల్చడం ఏంటి అంటూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా భార్య, ఇద్దరు కొడుకులు ఉండగానే మదాంపట్టి రంగరాజు ఇప్పుడు ఇంకొక అమ్మాయిని వివాహం చేసుకోవడం అందులోనూ ఆమె ఆరు నెలల ప్రెగ్నెన్సీ అని తెలిసి రంగరాజు పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

మదాంపట్టి రంగరాజ్ బ్యాక్ గ్రౌండ్..

ఇక ఈయన విషయానికి వస్తే.. ఒక ప్రసిద్ధ చెఫ్ గా పేరు సొంతం చేసుకున్నారు. 1999లో చెఫ్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈయన బెంగళూరులోని ఒక రెస్టారెంట్లో పని చేసేవారు. ఆ తర్వాత స్వస్థలానికి తిరిగి వచ్చి క్యాటరింగ్ వ్యాపారాన్ని స్థాపించి, నటుడు కార్తీతో సహా 400 కంటే ఎక్కువ వివాహాలకు క్యాటరింగ్ చేశారు. ఇక వంట చేయడంలోనే కాదు ‘మెహందీ సర్కస్’ వంటి చిత్రాలలో తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఇప్పుడు ఆ గుర్తింపు కంటే ఇప్పుడు ఇలా వ్యక్తిగతంగా విమర్శలు ఎదుర్కొంటూ మరింత పాపులారిటీ సంపాదించుకున్నారని చెప్పవచ్చు.

Related News

సిగరెట్ తాగుతూ ప్రేయసితో అడ్డంగా బుక్కైన జయం రవి.. వీడియో వైరల్!

స్టార్ హీరోలతో పోటీపడుతున్న నాగ్.. నిర్మాతలకు షాక్..

క్రిస్మస్ బరిలో దాదా VS కింగ్ 100.. నందమూరి – అక్కినేని హీరో పోరు..

‘దాదా’గా విశ్వరూపం చూపించబోతున్న బాలయ్య.. విడుదల ఎప్పుడంటే?

అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్న అక్కినేని హీరో… ఇప్పటీకి బాధగా ఉందంటూ!

సూరి, సుహాస్ ‘మండాడి’ ట్రైలర్ రిలీజ్!

ఒంటరిగా ఉన్నప్పుడు అలాంటి పనులు చేస్తా – అక్కినేని సుమంత్

కళ్ళుచెదిరే రేంజ్ లో ‘వారణాసి’ తెలుగు థియేట్రికల్ బిజినెస్.. టాలీవుడ్ లోనే హైయెస్ట్!

Big Stories

Advertisement
×