BigTV English

Sharwanand: శర్వానంద్‌కు కేసీఆర్‌ను కలిసేంత పలుకుబడి ఉందా?.. ఏంటి సంగతి?

Sharwanand: శర్వానంద్‌కు కేసీఆర్‌ను కలిసేంత పలుకుబడి ఉందా?.. ఏంటి సంగతి?
sharwanand kcr

Sharwanand latest news(Today tollywood news): ప్రధాని మోదీనైనా కలవొచ్చేమో కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడం అంత ఈజీ కాదంటారు. ఆయన కలవాలని అనుకుంటేనే.. ఎవరైనా కలవగలరు. అంతేకానీ, మనం కలవాలనుకుంటే ఆయన కలవరని చెబుతుంటారు. మంత్రులు, ఎమ్మెల్యేలకే ప్రగతి భవన్‌లోకి అనుమతి ఉండదంటారు. కొత్త సచివాలయంలోకి విపక్షాలు, సామాన్యులు, జర్నలిస్టులకు సైతం నో ఎంట్రీ. ఎంత ముఖ్యమైన పని అయినా.. ముఖ్యమంత్రిని కలవడం చాలా కష్టం. అట్లుంటది కేసీఆర్‌తోని.


అలాంటిది.. ఓ నటుడికి నేరుగా ప్రగతి భవన్‌లోకి అనుమతి లభించింది. హీరో శర్వానంద్ కేసీఆర్ ఇంటికెళ్లి మరీ.. తన మ్యారేజ్ రిసెప్షన్‌కు రారమ్మంటూ ఇన్‌వైట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఎంచక్కా ఫోటోలు, వీడియోలు కూడా దిగారు ఆ ఇద్దరు.

ఆ విజువల్స్ చూసిన వారంతా ఒకటే చర్చ. శర్వానంద్‌కు.. సీఎం కేసీఆర్ బానే టైమ్ ఇచ్చారు.. ఏంటి సంగతి? అంటూ. పెద్ద పెద్ద పనులు, ప్రజా సమస్యల కోసం వెళ్లే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులనే పట్టించుకోని కేసీఆర్.. హీరో శర్వానంద్‌ను మాత్రం అంత తీరిగ్గా కలుసుకునేందుకు ఆసక్తి చూపడం మామూలు విషయం కానే కాదంటున్నారు. ఇంతకీ, శర్వానంద్‌కు ఎందుకంత ప్రయారిటీ?


హీరో శర్వానంద్‌ది చాలా పలుకుబడి ఉన్న ఫ్యామిలీ. ఆయన తాత.. సీనియర్ ఎన్టీఆర్‌కే చార్టెర్డ్ అకౌంటెంట్‌గా ఉండేవారు. నందమూరి వారి ఆస్తులను.. ఇప్పటికీ వారి కుటుంబమే డీల్ చేస్తుందని అంటారు. ఈ విషయం ఓ టీవీ షోలో శర్వానందే స్వయంగా చెప్పారు. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో.. శర్వానంద్ ఫ్యామిలీకి సైతం భారీగా భూములు, ఆస్తులు ఉన్నట్టు టాక్.

అసలే ఆస్తులు, చార్టెర్డ్ అకౌంటెంట్ అంటుండటం.. శర్వానంద్‌కు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడంపై.. సోషల్ మీడియాలో రకరకాల చర్చ నడుస్తోంది. ఇంకేం, కమాన్ గుసగుస.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×