BigTV English
Advertisement

Vastu Tips : ఇంటి డ్రైన్ వాస్తులో తేడా ఉంటే జరిగేది ఇదే

Vastu Tips : ఇంటి డ్రైన్ వాస్తులో తేడా ఉంటే జరిగేది ఇదే
vastu


Vastu Tips : ఇంటిని నిర్మించేటప్పుడు డ్రైనేజీ విషయంలో కూడా వాస్తు పాటించాలంటోంది శాస్త్రం. ఇల్లు వాస్తు బాగుండి..డ్రైనేజీ నీరు వాస్తు లేకపోతే ఆర్థికంగా నష్టమేనంటోంది. నీరు ఏ దిశ నుంచి ఏదిశకి వెళ్లాలో స్పష్టంగా చెబుతోంది వాస్తు శాస్త్రం. ఇల్లు శుభ్రపరుచుకునే నీరు అయినా, డిష్ వాష్ వాటర్ , బట్టలు ఉతికితే వెళ్లే నీరు అయినా ఏదైనా సరే ఇంటి ప్రాంగణం నుంచి ప్రహారీ గోడ దాటి బయటకి డ్రైనేజీకు వెళ్తాయి. చాలా మంది చెప్పే మాట ఈశాన్యం నుంచి బయటకి వెళ్తే మంచిది అని చెబుతారు. కానీ అలా సందర్భాల్లోను సాధ్యం కాదు. సౌత్ ఫేసింగ్ లో ఇల్లు ఉంటే దక్షిణంలో వీధి ఉంటుంది. రోడ్డు ఉంటుంది. డ్రైనేజీ కూడా దక్షిణం వైపే ఉండాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో నీరు ఈశాన్యం వైపు వెళ్లే పరిస్థితి ఉండదు. దక్షిణం వైపు నుంచే నీరు వెళ్లక తప్పదు.

పడమర దిక్కు ఉన్న వారికి కూడా ఇలాంటి సమస్యే వస్తుంది. ఈశాన్య దిక్కు నుంచి నీరు వెళ్లే అవకాశం కనిపించదు. ఇలాంటి పరిస్థితుల్లో నీరు ఏ వైపుగా వెళ్లాలంటే… అవకాశం ఈశాన్యం వైపు మళ్లించాలి. లేదంటే ఆగ్నేయం వైపు నుంచి కానీ, వాయువ్య మూల నుంచి కానీ వాడకపు నీరు బయటకి వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంట్లో డ్రైనేజీ సిస్టమ్ వాస్తు నియమాలను అనుసరించి ఉండకపోతే ఆ ఇంట్లో ఆర్థిక నష్టాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. నీటి పారుదల వ్యవస్థ సరిగా లేకపోతే, నీళ్లు మాదిరిగా డబ్బులు కూడా అనవసరంగా
వృధా ఖర్చు అవుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకి దిగజారి పోతాయి. ఇల్లు కట్టేటప్పుడు డ్రైనేజీ వ్యవస్థ పైన కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలి.


వాస్తు ప్రకారం అయితే తూర్పు పల్లంగా, పడమర ఎత్తుగా ఉండాలి. దక్షిణం ఎత్తుగా, ఉత్తరం పల్లంగా ఉండాలి. నీరు కూడా పల్లానికి ప్రవహించాలి. అంటే ఇంట్లో డ్రైనేజీ వ్యవస్థ తూర్పున, ఉత్తరం వైపు ప్రవహిస్తే మంచిది.తూర్పు దిక్కున నీటిపారుదల వ్యవస్థ ఉంటే ఆ నివాసంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. కుటుంబ సభ్యుల పురోగతి బాగుంటుంది. ఉత్తర దిక్కులో కూడా నీరు ప్రవహించినప్పటికీ ఆ ఇంటికి శుభమే జరుగుతుంది. కుటుంబ ఆర్థిక పురోగతి ఉంటుంది. ఇవేమీ అవగాహన డ్రైనేజీ వ్యవస్థను ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే మనకు తెలియకుండానే కష్టాలు అనుభవించాల్సి ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Related News

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Big Stories

×