E-Paper
Advertisement

Coins : గాజులో కాయిన్స్ పెడితే కలిసి వస్తుందా….

Coins : గాజులో కాయిన్స్ పెడితే కలిసి వస్తుందా….

Coins : తెలిసీ తెలియకుండాచేసే కొన్ని తప్పుల వల్ల మనల్ని లక్ష్మీదేవి వదిలి వెళ్లిపోతుంది. అలాంటప్పుడు ఆర్ధిక సమస్యలు , కష్టాలు వెంటాడుతు ఉంటాయి. అలాంటి వారు లక్ష్మీకటాక్షం పొందడానికి కొన్ని పరిహారాలు పాటిస్తే సమస్యల నుంచి బయట పడ వచ్చని పరిహార శాస్త్రం చెబుతోంది. గాజు సీసాలో 21 కాయిన్స్ తో ప్రయోగం చేస్తే ఫలితాలు ఉంటుందని చెబుతోంది. ఇంట్లో ఐశ్వర్య లక్ష్మి శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆర్ధిక సమస్యలు ఉన్నవారు, ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, సంపాదించిన డబ్బంతా ఖర్చు అయిపోతుందని బాధపడే వారు ఈ పరిహారాన్ని పాటించి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని శాస్త్రం అంటోంది.

గాజు సీసాలో నీళ్లు పోసి అందులో గళ్లు ఉప్పు వేయాలి. ఐదు లేదా రెండు రూపాయలు, కానీ రూపాయి కాయిన్స్ ఏవైనా సరే 21 కాయిన్స్ ఆ సీసాలో వేసి గంట పాటు ఉంచి శుభ్రంగా తుడిచి ఎర్రటి బట్టలో కట్టాలి. ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి మారే డబ్బుల నుంచి నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తూ ఉంటుంది. కాయిన్స్ కడిగిన నీళ్లను ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయాలి. లేదంటే సింక్ లో పోసినా తప్పులేదు. ఇంత సంపాదిస్తున్న దిష్టి కూడా డబ్బుకి కలుగుతుంది. డబ్బుకి ఉండే నెగిటివ్ వేబ్రేషన్స్ క్లియర్ చేయడానికీ ఈవిధంగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత గాజు సీసాను కడిగి పూజ గదిలోని లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచాలి. అందులో 21 కాయిన్స్ లో ఒకదానిని వేసి దాన్ని ఉత్తర దిక్కులో పెట్టాలి.

అలా సీసాలో రోజుకో కాయిన్ వేస్తూ ఉండాలి. 21 రోజులు పూర్తయిన తర్వాతి రోజు సీసాలో నీళ్లు పోసి మూతపెట్టి చంద్రకిరణాలు తాకేలా ఆరుబయట ఉంచితే ఎనర్జీ కలుగుతుంది. గంటపాటు ఉంచిన తర్వాత అందులో మామిడాకు వేసి ఆ నీళ్లను ఇల్లు అంతా చల్లాలి. ఇలా పూజ చేసిన నీళ్లు పవిత్ర జలంగా మారతాయి. ఇలా చేసినప్పుడు ఆర్ధిక పరమైన సమస్యలు మిమ్మల్ని వదిలిపెడతాయి.
అమావాస్య వెళ్లిన రెండో రోజు ఈ పరిహారాన్ని పాటిస్తేనే ఫలితం దక్కుతుంది. ఈ 21 కాయిన్స్ లో నాలుగింటిని మీ పర్సులో ఉంచుకుని వాటిని కదిలించకుండా ఉంచితే మీకు మంచి రోజులు మొదలవుతాయి.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×