E-Paper
Advertisement

గుదిబండగా మారిన స్టిక్కరింగ్.. ఆటో డ్రైవర్ల బతుకు చిద్రమేనా..?

గుదిబండగా మారిన స్టిక్కరింగ్.. ఆటో డ్రైవర్ల బతుకు చిద్రమేనా..?
Advertisement

Reflective Stickers: స్వేచ్ఛ బ్యూరో: ట్రాన్స్ పోర్టు వాహనదారులు రేడియం స్టిక్కర్ అంటేనే జంకుతున్నారు. ఒక్కో వాహనానికి స్టిక్కర్ వేయడానికి వేల రూపాయలు ఖర్చు అవుతుండటంతో అదనపు భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టిక్కర్ మస్ట్ అంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పాటు స్టిక్కర్ ఉంటేనే ఫిట్ నెస్ సర్టిఫికెట్ అంటూ మెలిక పెట్టడంతో ఇబ్బందులు తప్పడం లేదు. స్టిక్కర్లకు అనుమతించిన కంపెనీలు ధరలు వారికి అనుగుణంగా పెంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరి ప్రభుత్వం నిఘాపెట్టి ధరలు పెరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

రిప్లెక్టీవ్ రేడియల్ స్టిక్కర్..

రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణాశాఖ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ట్రాన్స్ పోర్టు (వాణిజ్య ) వాహనాలువిధిగా రేడియల్ స్టిక్కర్ వేయాలని, ఆ వాహనం చుట్టూ ఏర్పాటు చేస్తే వెనుకనుంచి వచ్చే వాహనదారుడికి స్పష్టంగా కనపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర మోటార్ వాహనాల నియమాలు, 1989 లోని రూల్ 104 నుండి 104(E) ప్రకారం రేడియల్ స్టిక్కర్(రిఫ్లెక్టివ్ టేపు)లు , రియర్ మార్కింగ్ ప్లేట్లు అమర్చడం తప్పనిసరి అయిన వాహనాలపై QR ఆధారిత మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్) ద్వారా ధృవీకరణ విధానాన్ని అమలు చేస్తుందని, స్టిక్కర్లు వాడటంతో కిలో మీటర్ పరిధిలో ఉన్న వాహనాలు సైతం డ్రైవర్లు గుర్తించే వీలుంటుంది. రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని స్పష్టం చేసింది. 5 కంపెనీలకు రిప్లెక్టీవ్ రేడియల్ స్టిక్కర్ లకు అనుమతులు ఇచ్చింది. అయితే కంపెనీలు మాత్రం నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి ధరలను పెంచుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలు అతిక్రమించే సంస్థలపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కొన్ని కంపెనీలు మాత్రం ధరలు పెంచాయని పలువురు వాహనదారులు పేర్కొంటున్నారు.

ఫిట్ నెస్ ధృవీకరణ పత్రం

Advertisement

రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ పోర్టు వాహనాలు సుమారు 2కోట్లు ఉన్నట్లు సమాచారం.అందులో ఆటో ట్రాలీ, లారీ, ట్రాక్టర్లు, డీసీఎం తదితర వాహనాలు ఉన్నాయి. అయితే ఈ వాహనాలకు రేడియల్ స్టిక్కర్ తప్పని సరి, స్టిక్కర్ లేకుంటే ఫిట్ నెస్ ధృవీకరణ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగదని పేర్కొంది.స్టిక్కర్ ఉంటే ఫిట్ నెస్ సర్టిఫికెట్ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఆటో ట్రాలీ వాహనంకు స్టిక్కర్ వేయాలంటే వెయ్యి రూపాయలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్యాసింజర్లు లేక పోవడంతో రోజువారీ ఆదాయం తగ్గిందని కుటుంబ పోషణ భారంగా మారిందని పలువురు ఆటో డ్రైవర్లు పేర్కొంటున్నారు. దీనికి తోడు స్టిక్కర్ వేసుకుంటే అదనపు భారం పడుతుందని పేర్కొంటున్నారు. దీనికి తోడు లారీకి 6200, డీసీఎంకు 5200 అవుతుందని యజమానులు తెలిపారు. అంటే 2కోట్ల వాణిజ్య వాహనాలకు ఈ స్టిక్కర్లతో 6వేలకోట్లు అవుతుందని సమాచారం.

Also Read: Jagtial: జగిత్యాలలో విషాదం.. గుండెపోటుతో 9 ఏళ్ల బాలుడు మృతి

కొరవడిన అధికారుల నిఘా

Advertisement

రేడియల్ స్టిక్కర్స్ సంస్థలపై రవాణా శాఖ అధికారుల నిఘా కొరవడిందనే విమర్శలు వస్తున్నాయి. సంస్థలకు ధరల పెంచవద్దని ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ సంస్థల ధరల్లో తేడాలు ఉన్నాయి. ఒక్కో సంస్థ ఒక్కో విధంగా ధరలను నిర్ణయించాయి. ప్రభుత్వ నియంత్రణలో ఆ సంస్థలు ఉంటే ఒకే ధర నిర్ణయించేదని కానీ అందుకు విరుద్దంగా సంస్థలే ధరలు ఫిక్స్ చేశాయనేది స్పష్టమవుతోంది. అన్ని సంస్థలు ఒకే ధర నిర్ణయించేలా చర్యలు తీసుకోవాలని, వాటిపై పర్యవేక్షణ చేయాలని పలువురు కోరుతున్నారు.

ధరల నియంత్రణ చేపట్టాలి

రవిశంకర్ అల్లూరి,అఖిల భారత ప్రధాన కార్యదర్శి ,భారతీయ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ మజ్దూర్ మహా సంఘ్ (బీఎంఎస్) రేడియల్ స్టిక్కర్ వేసుకోవడం వాణిజ్య వాహన యజమానులకు గుదిబండగా మారింది. కేవలం ట్రాలీ ఆటోకే వెయ్యి రూపాయలు అవుతుండటంతో అదనపు భారం పడుతుంది. ఇప్పటికే గిరాకీలు లేక పూటగడువడం కష్టంగా మారింది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఆటోలకు రేడియల్ స్టిక్కర్ వేసుకోవాలనే నిబంధన పెట్టింది. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన కంపెనీలు ధరలు వారికి అనుగుణంగా నిర్ణయించుకున్నాయి. ధరలపై అడిగితే సమాధానం కూడా చెప్పడం లేదు. అధికారులు పర్యవేక్షణ చేయాలి. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలి.

Also Read: హైటెన్షన్.. హైదరాబాద్ జేఎన్‌టీయూలో బాంబు బెదిరింపు కాల్.. ఉలిక్కిపడ్డ విద్యార్థులు

Related News

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

Big Stories

Advertisement
×