E-Paper
Advertisement

Check Dam Collapse: వరుసగా కూలుతున్న చెక్ డ్యామ్‌లు.. వైఫల్యాలకు కారణాలేంటి..?

Check Dam Collapse: వరుసగా కూలుతున్న చెక్ డ్యామ్‌లు.. వైఫల్యాలకు కారణాలేంటి..?
Advertisement

Check Dam Collapse: గత కొద్ది రోజులుగా చెక్ డ్యామ్‌లు కూలిపోతున్న వరుస ఘటనలు సంచలనం రేపుతున్నాయి. ఉపనదులు, వాగుల్లోని నీటితో భూగర్భ జలాల పెంపు కోసం చెక్ డ్యామ్‌లు నిర్మాణం చేయగా.. వాటి పరిస్థితి అధ్వాన్నంగా మారింది. నిర్మాణాలు పూర్తయి రెండేళ్లు గడవకముందే చెక్ డ్యాములు ధ్వంసం అవ్వడం ఆందోళన కలిగిస్తోంది. నీళ్లను ఒడిసిపట్టాల్సిన డ్యామ్‌లే.. ఆ నీళ్లలో కొట్టుకుపోతున్నాయి. కోట్ల  రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఇరిగేషన్ ప్రాజెక్టుల వరుస వైఫల్యాలకు కారణాలేంటి..?

నవంబర్ 21న మానేరు నదిపై తనుగుల వద్ద నిర్మించిన చెక్ డ్యామ్ కూలిపోయింది. డిసెంబర్ 17న మానేరు నదిపై అడవిసోమనపల్లి వద్ద సుమారు 40కోట్ల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యామ్ కూలిపోయింది. ఇలా మానేరు నదిపై నిర్మించిన ప్రాజెక్ట్‌లు వరుసగా ధ్వంసం అవుతున్నాయి.

Advertisement

సోమన్ పల్లి చెక్ డ్యామ్ కూలడంతో ఇరిగేషన్ శాఖ అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భారీ వరద లేకున్నా, డ్యామ్ కూలడం వెనక కుట్ర కోణం ఉందంటూ ఫిర్యాదులో అనుమానాలు వ్యక్తం చేసింది ఇరిగేషన్ శాఖ. దీంతో కేసు నమోదు చేసుకున్న కొయ్యూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 580 మీటర్ల పొడవుతో మానేరు నదిపై సోమన్ పల్లి, వల్లంకుంట శివారులో 2023లో నిర్మించిన భారీ చెక్ డ్యామ్‌లో 150 మీటర్లు మేర కుంగిపోయి, నదిలో కూలిపోయింది.

సోమన్ పల్లి చెక్ డ్యామ్ ఉన్నపళంగా డ్యామేజ్ కాలేదు. రెండేళ్ల క్రితం నుండే చెక్ డ్యామ్ బేస్మెంట్ కుంగుతూ వస్తోంది. ఫౌండేషన్ కింది నుండి నది నీళ్లు ప్రవహిస్తూ కింద ఉన్న ఇసుక మొత్తం బయటకు కొట్టుకువచ్చింది. చెక్ డ్యామ్‌లోని 5వ బ్లాక్ కింద భారీ కుహరం ఏర్పడి నీళ్లు ప్రవహిస్తున్నాయి.

Advertisement

వరుసగా ప్రాజెక్టులు ధ్వంసమవుతుండడంతో బీఆర్ఎస్ నేత.. ప్రకాశ్ నిజనిర్ధారణ కమిటీ పేరుతో డ్యామేజ్ అయిన ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు. ఇసుక కోసమే ఎవరో కావాలని చెక్ డ్యామ్‌లను బాంబ్‌లతో పేలుస్తున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్ మొదలుకుని, సోమన్ పల్లి చెక్ డ్యామ్ కూలడం వరకు కుట్ర కోణం ఉందంటున్నారు బీఆర్ఎస్ నేత ప్రకాశ్.

సోమన్ పల్లి చెక్ డ్యామ్ నాసిరకంగా నిర్మించడంతోనే కూలిపోయిందంటున్నారు స్థానిక రైతులు. చెక్ డ్యామ్ వల్ల తమకు ఎలాంటి ఉపయోగం లేదని, చెక్ డ్యామ్ కారణంగా మానేరు వరద పోటెత్తి తమ పంట పొలాలు మునిగి నష్టపోయామని మండిపడుతున్నారు. 2021 లో నిర్మాణం మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు 3సార్లు డ్యామేజ్ జరిగిందని అంటున్నారు సోమన్ పల్లి రైతులు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల వరుస వైఫల్యాల.. డిజైన్‌ల లోపాలను ఎత్తి చూపుతున్నాయని ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2020 – 2022 మధ్య కాలంలో చేపట్టిన నిర్మాణాలకు సరైన డిజైన్‌లు పాటించకపోవడం, ప్రతికూల ప్రదేశాల్లో ప్రాజెక్టులను నిర్మించడంతోనే చెక్ డ్యామ్‌ల డ్యామేజ్ జరుగుతోందన్న చర్చ జరుగుతోంది. గత పదేళ్లలో 449 చిన్న, మధ్య తరహా చెక్ డ్యామ్‌ల నిర్మాణాలు పూర్తి కాగా అన్నిటికీ ఒకే రకమైన డిజైన్ వాడారని తెలుస్తోంది. కరీంనగర్ ఇరిగేషన్ సర్కిల్ పరిధిలో 32 చెక్ డ్యామ్‌ల నిర్మాణం పూర్తి కాగా.. నాణ్యతా లోపాలతో అవన్నీ ఎప్పుడు కూలుతాయోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మానేరుపై నిర్మించిన అన్ని డ్యామ్ లలో నిర్మాణపరమైన లోపాలు, పగుళ్లు, గోడల కుంగుబాటు కనిపిస్తోందని ఇరిగేషన్ అధికారుల్లో చర్చ జరుగుతోంది. దాదాపు అన్ని చెక్ డ్యామ్‌ల ఫౌండేషన్ కింద చిన్న చిన్న కేవిటీల నుండి భారీ బుంగలు ఏర్పడి ప్రమాద స్థితిలో ప్రాజెక్టులు ఉన్నాయట. వరద తాకిడికి తట్టుకోలేక కొన్ని చెక్ డ్యాములు ధ్వంసం అవుతుంటే, చెక్ డ్యామ్‌ల ఫౌండేషన్ అడుగున భారీ గుంతలు ఏర్పడి మరికొన్ని నిట్టనిలువునా కూలిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ శాఖ ప్రమాద ఘంటికలు ముందే గుర్తించకుండా, ఏం చేస్తుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో సాయిల్ టస్టులు చేయకపోవడం, సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతోనే చెక్ డ్యాములు కుంగిపోతున్నాయని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఇంజనీర్ల పర్యవేక్షణ, క్వాలిటీ పరీక్షలు జరపకపోవడంతోనే నష్టం వాటిల్లుతోంది. ప్రాజెక్టుల డ్యామేజ్ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు, ఇరిగేషన్ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీస్ ఎంక్వైరీ జరుగుతోంది అంటూ తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపకపోతే.. మరిన్ని ప్రాజెక్టుల డ్యామేజ్ తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యంపై, నాణ్యత లేని ప్రాజెక్టుల మరమ్మతుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు.

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×